వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ మారిన వారు రాజీనామా చేయాల్సిందే.... ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడడంతో ఆయన వైసీపీలో చేరేందుకు సన్నద్దమవుతున్నాడు. దీంతో ఎవరైనా ఇతర పార్టీలోకి చేరాలనుకునే వారు రాజీనామా చేయాల్సిందేనని స్పీకర్ చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ జగన్ వెంట నడుస్తానని కూడ ప్రకటించంతో ఆపార్టీలోకి చేరడం ఖాయంగా మారింది. అయితే వైసీపీ పార్టీలోకి వెళ్లేముందు రాజీనామా చేస్తారా అనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. దీనిపై టీడీపీ నేత లోకేష్ సైతం వంశీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే వంశీ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనకు కుటుంబ వారసత్వంగా వచ్చిన పదవి కాదంటూనే లోకేష్‌కు ఓ న్యాయం తనకు ఓ న్యాయమా అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు.

 MLAS should resign Those who change the party, AP Speaker

ఇక పార్టీ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై గత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్ మాత్రం చంద్రబాబు వలే ఆ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోనని స్పష్టం చేశారు. ఒకవేళ వస్తే మాత్రం రాజీనామా చేసిన తర్వతే పార్టీలోకి ఆహ్వానిస్తామని సభ ముఖంగా చెప్పారు. అయితే ఇప్పుడు అదే హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే వంశీని పార్టీలోకి ఆవ్వానిస్తున్న సీఎం జగన్ తన మాటకు కట్టుబడి ఉంటాడా అనే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ సైతం ఇదే అంశాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ఆయన మాటకే కట్టుబడి ఉన్నామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో వంశీ రాజీనామాపై చర్చకు దారి తీసింది.

English summary
MLA'S should resign Those who change the party, AP Speaker Tammineni said. and he made it clear that there would be taken action against party-turned-MLAs without resigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X