న్యాయం గెలిచిందా- రోగం గెలిచిందా..!?

తెలుగుదేశం అధినేత మధ్యంతర బెయిల్..టీడీపీ నేతల ర్యాలీల పైన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ నాలుగు వారాలు ఇచ్చిందని గుర్తు చేసారు. దీంతో న్యాయం గెలిచిందంటూ టీడీపీ శ్రేణులు విచిత్ర విన్యాసాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణం అన్నారు.

మానవతాదృక్పదంతోనే కోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, కానీ, టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్లను బలి ఇచ్చి.. రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు నాలుగు వారాలు వైద్యంకోసం మాత్రమే బయటకు వచ్చాడని అన్నారు. చంద్రబాబు ఉన్నంతకాలం ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపిస్తారంటూ ప్రకాశ్ రెడ్డి అన్నారు. వైద్యంకోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలి. 2024 కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు పట్టిన గతే టీడీపీకి పడుతుందని ప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు. న్యాయం గెలిచిందని చెప్పే టీడీపీ నేతలు న్యాయం గెలిచిందా.. రోగం గెలిచిందా అని ప్రశ్నించారు.

MLA Topudurty Prakash Reddy made serious comments on Chandra Babu interim Bail and TDP Celebrations

తప్పు చేసిన వాళ్లు బయట తిరిగితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుందన్నారు. 73 ఏళ్ల వయసులో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చంద్రబాబు క్యాంట్రాక్ట్‌ ఐ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు ధ్రువీకరణపత్రం ఇవ్వడంతో 28 రోజుల పాటు బెయిల్‌ ఇచ్చారని పేర్కొన్నారు. వయసు రిత్యా అనేక జబ్బులు ఉన్న చంద్రబాబుకు మానవతా దృక్పథంతో కేవలం చికిత్స కోసమే కండీషన్‌ బెయిల్‌ ఇచ్చారన్నారు. బెయిల్‌ అంశంలో ఎక్కడా కూడా కేసు పూర్వపరాలు గురించి ప్రస్తావించలేదని వివరించారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆదేశాలను అమలు చేస్తూ టిడిపి శ్రేణులు విజిల్స్‌ వేయడం, స్పూన్లతో సౌండ్లు చేయడం, కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వంటి విచిత్రమైన విన్యాసాలను నారా లోకేష్‌ ఆదేశాలతో చేపట్టారని ప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ముందు నుంచి కూడా కోర్టు ఎక్కడా కూడా కేసులో చంద్రబాబు పాత్ర లేదనే విషయాన్ని వెల్లడించలేదని గుర్తు చేసారు. ప్రజల్ని మోసం చేయడంలో సిద్ధహస్తుడు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న జగన్‌ని ప్రజలు గెలిపిస్తూ ఉంటారన్నారు. చంద్రబాబు చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నా అంటూ తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+