వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకు బెనిఫిట్: కొత్త అసెంబ్లీలో బాబు తొలి సంతకం దాని పైనే!

|
Google Oneindia TeluguNews

అమరావతి: హైదరాబాద్ నుంచి విజయవాడకు తన మకాం మార్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనా విభాగాలను సైతం కొద్దికాలంలోనే అక్కడికి తరలించేశారు. అనంతరం తాత్కాళిక అసెంబ్లీ భవనాన్ని కూడా అనతి కాలంలోనే నిర్మించారు.

నేటి ఉదయం వెలగపూడిలో నిర్మించిన ఈ తాత్కాళిక అసెంబ్లీ భవనాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో కలియతిరిగారు. తన కార్యాలయంలోని సీటులో కూర్చుని, నిర్మాణం, ఏర్పాట్ల పట్ల సీఎం సంత్రుప్తి వ్యక్తం చేశారు.

MLAs get Rs50 thousand extra, Cm taken decision in new assembly

సీట్ల ఏర్పాటు సౌకర్యవంతంగా ఉందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ సభలో ఉందని అన్నారు. అసెంబ్లీ సభ్యులకు అమరావతి ప్రాంతంలో ఎలాంటి క్వార్టర్స్ లేనందునా.. రూ.50వేల అదనపు భత్యాన్ని వారికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలపై సంతకం చేశారు.

కాగా, కొత్తగా నిర్మించిన ఈ అసెంబ్లీ భవనంలో మార్చి 6న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతారు.

English summary
MLAs get Rs50 thousand extra, Cm taken decision in new assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X