సునీతకు చంద్రబాబు 'తాతయ్య' మిఠాయి (పిక్చర్స్)
హైదరాబాద్: తాతయ్య అయినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సోమవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మగశశివు జన్మించిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలకృష్ణ కూతురైన బ్రాహ్మణి శనివారంనాడు మగశిశువును ప్రసవించారు.
మన్మథనామ సంవత్సరం విదియ తిథిని లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రం రెండో పాదంలో ఆ శిశువు ఇహలోకంలోకి వచ్చాడు. కర్కాటక లగ్నం మీనరాశిగా శిశువు జననాన్ని గుర్తించారు. దీంతో నారా, నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనివ్వడంతో చంద్రబాబు, బాలయ్య తాతలయ్యారు. ఇరు కుంటుబాల్లోనూ వారసుడొచ్చానే ఆనందం తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు.. మిఠాయిలు పంచారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, నేతలు, ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

పరిటాల సునీతకు మిఠాయి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోమవారం మంత్రి పరిటాల సునీతకు మిఠాయి ఇస్తున్న దృశ్యం. పక్కన పీతల సుజాత.

మిఠాయిలు పంచారు
సోమవారం అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు.. మిఠాయిలు పంచారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, నేతలు, ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు
సోమవారం అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు.. మిఠాయిలు పంచారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, నేతలు, ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

నారా లోకేష్
నారా లోకేష్ - బ్రాహ్మణిల జంటకు శనివారం.. ఉగాది పర్వదినం నాడు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు కొడుకు పుట్టాడు. నారా లోకేష్ తన తనయుడిని చేతులతో ఎత్తుకొని మురిసిపోయాడు.












Click it and Unblock the Notifications