ఏపీపై ఆర్ధికభారం ఆ వ్యవస్థల వల్లే.. ఉద్యోగులకు ఏం సంబంధం; జగన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి వ్యవహారంపై క్లారిటీ రావడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో భేటీ అయినప్పటికీ ఇప్పటి వరకు దీని పైన స్పష్టత రాని పరిస్థితి ఉంది. గురువారం రోజు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకుని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారం మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో అందరూ ఆలోచించాలని సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపిన సీఎం నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని అంటూ, మనసా, వాచా మంచి చేయాలన్న తపనతో ఉన్నానంటూ పేర్కొన్నారు.

ప్రజలను మోసం చేసినట్టు ఉద్యోగులను మోసం చేస్తున్న జగన్
అయితే ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు పిఆర్సి విషయంపై మాట్లాడారు. జగన్ తో భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు రాత్రి నిద్రపోయి ఉండరంటూ వ్యాఖ్యానించిన ఆయన ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేసినట్టు ఎంప్లాయిస్ ను కూడా మోసం చేస్తారు అని ఉద్యోగులు ఊహించలేదని, రెండు చేతులతో ఓట్లు వేశామని చెప్పిన ఉద్యోగులను మోసం చేయడం సులువు అని భావించే జగన్మోహన్రెడ్డి ఎంప్లాయిస్ ను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.

27 శాతం ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే వీలు లేదని చెప్పడం మోసమే
27 శాతం ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే వీలు లేదని చెప్పడం ఎంప్లాయిస్ ను మోసం చేయడమేనని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. ముఖ్యమంత్రితో భేటీలో ఆయన తన స్వగతాన్ని చెప్పుకున్నాడని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. తాను గొప్పవాడినంటూ, రాష్ట్రంలో కష్టాలు ఉన్నాయని, నేను మంచి చేయాలని ఆలోచిస్తున్నానని, ఉద్యోగులు సహకరించాలని చేసిన విజ్ఞప్తుల వెనక ఆయన స్వగతం తప్ప ఇంకేమీ లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. 27 శాతం ఐఆర్ ఇస్తే ఫిట్మెంట్ కూడా గొప్పగా ఉంటుందంటూ ఉద్యోగులు ఊహించుకున్నారు అని, కానీ 14.2 9% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పడం ఏ విధమైన శాస్త్రీయతో చెప్పాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన జగన్
27 శాతం ఐఆర్ ఏ శాస్త్రీయత ఆధారంగా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఏ శాస్త్రీయత ఆధారంగా హామీ ఇచ్చారు. ఫిట్మెంట్ 14.29 శాతాన్ని ఈ శాస్త్రీయ ఆధారం గా నిర్ధారించారు అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడే విధానం చూస్తే చాలా జాగ్రత్తగా బాధతో ఉన్నట్టు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని అడగడం దారుణం అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలలో నోటికొచ్చిన హామీలిచ్చి, ఇప్పుడు మోసం చేయడం దారుణమని మండిపడ్డారు జగన్ ఇస్తామని చెబుతున్న ఫిట్మెంట్ సరిపోదని అధికారుల కమిటీ ఇచ్చిన ఫిట్మెంట్ 14.29% తో ఉద్యోగులందరూ నష్టపోతారని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు.

ఏపీ ఆదాయం, చేస్తున్న అప్పులు ఏమైపోతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తుందని, తెలంగాణ రాష్ట్రం కంటే 35 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని పేర్కొన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను కూడా చాలా ఇస్తుందని, ఇవి కాక రాష్ట్రం రుణాలను కూడా ఎక్కువగా చేస్తుందని, ఈ ఆదాయం అంతా ఏమై పోతుంది అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఉద్యోగులకు పిఆర్సి విషయానికి వస్తేనే రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోతుందా అంటూ నిలదీశారు. ఉద్యోగస్తుల జీతాలు ఎక్కువ ఉన్నాయని చేస్తున్న ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు.

ఏపీపై ఆర్ధిక భారం పెరిగింది ఆ మూడు వ్యవస్థల ఏర్పాటు వల్లే .. ఉద్యోగులకు ఏం సంబంధం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగడానికి, ఉద్యోగస్తుల జీతభత్యాలు పెరగడానికి కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, విలేజ్ వాలంటీర్ లను ఏర్పాటు చేయడం, సచివాలయాలు ఏర్పాటు వాటికి సంబంధించిన ఖర్చులే కారణమంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్షా ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులు, 60 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, రెండు లక్షల మంది విలేజ్ వాలంటీర్ల జీతాలు పెంచితే ప్రభుత్వం మీద పదివేల కోట్ల ఆర్థిక భారం పెరుగుతుందని, కేవలం ఈ మూడు వ్యవస్థలు రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధీనంలోకి తీసుకువచ్చిన వ్యవస్థలని, దీంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకు సంబంధం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

గొర్రెతోక పీఆర్సీ ఇచ్చి అక్టోబర్ నుండి అమలు చేస్తామని చెప్పటం దారుణం
విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలని, భవిష్యత్ అంచనాలు కూడా ఉండాలని అలా లేకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం మోసమని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇంతకంటే ఫిట్మెంట్ ఇవ్వలేనని చెప్పడం దిగజారుడుతనం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గొర్రె తోక పిఆర్సి ఇచ్చి అదికూడా అక్టోబర్ 2022 నుంచి అమలు చేస్తామంటే అసలు ఈ పిఆర్సి అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల చర్చలకి వెళ్లాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు. ఈ పీఆర్సీతో కావాలని ఉద్యోగ సంఘాలను అవమానించడమే, ఉద్యోగులను బాధించటమేనంటూ పేర్కొన్నారు.

2024 దాకా జగన్ సీఎంగా ఉంటాడో లేదో తెలియని పరిస్థితి
ఉద్యోగ సంఘాలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయబద్ధమైన పిఆర్సి అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2024 దాకా సీఎం ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు స్థాయిని దిగజార్చుకుని దేహీ అంటూ ముఖ్యమంత్రి చుట్టూ తిరగడం భావ్యంగా లేదన్నారు. పాడి గేదెను వదులుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని, ఉద్యోగులారా ఇకనైనా కళ్లు తెరవండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ఆయన ఆలోచించి ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చారని, కానీ ఇప్పుడు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర పరిస్థితిని అధ్వానంగా తయారుచేసి ఉద్యోగులకు మొండిచేయి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications