వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్లాసులో బూస్ట్ కలిపిచ్చిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి తన సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను ఉత్తేజితుల్ని చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాలను దక్కించుకోగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను నిలబెట్టడమే కాకుండా ఆమెకు అనూహ్యమైన ఘనవిజయం లభించేలా చేశారు.

ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఆ పార్టీ అభిమానుల్లో కూడా చంద్రబాబు కొత్త జోష్ ను నింపారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చినట్లైంది.

అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించడమే కాకుండా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల ఓట్లను కొల్లగొట్టింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీకి అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ ఎన్నికలు అందించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

mlc election results change to tdp and cadre

అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించడమే కాకుండా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న పంచుమర్తికి అదృష్టం వరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ను తెలుగుదేశం పార్టీ ఎదుర్కోగలుగుతుందా? జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు చేసి వైసీపీని ఢీకొట్టగలరా అనే సందేహం ఇతర పార్టీల్లో ఉంది.

అయితే పొత్తు కోసం టీడీపీ ఎదురుచూస్తుండగా, ఇప్పుడు తమ పార్టీకి ఇతర పార్టీలే ఎదురువచ్చి స్వాగతం పలుకుతాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ ఎన్నికలు నైరాశ్యంలో కూరుకుపోయిన క్యాడర్ కు గ్లాసు పాలలో బూస్ట్ వేసి ఇచ్చినట్లుందని, సొంత పార్టీలోనే కొందరు నాయకులకు తమ పార్టీ విజయంపై సందేహంతో ఉండేవారని, అటువంటివారందరికీ ఈ విజయాలు సమాధానమిచ్చిట్లవుతుందంటున్నారు.

రానున్న ఎన్నికల్లో అధికారం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో కథనాలను షేర్ చేసుకుంటున్నారు.

English summary
Telugu Desam Party chief Nara Chandrababu Naidu has been acting contrary to his natural inclination to gain power in the upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X