టీలో పట్టభద్రుల, ఏపీలో ఉపాధ్యాయ: విజయవాడలో ఉద్రిక్తం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే ఏపీలోని కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది.
అన్నిచోట్ల పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. బెజవాడలో మాత్రం కొంత ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికారపక్షం నాయకులను మాత్రం లోపలికి పంపిస్తున్నారని వారు విమర్శించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిదింది. దీనిపై టీడీపీ నేతల స్పందిస్తూ.. వామపక్షాల నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
మేథావులు అందరు బీజేపీకే ఓటు వేశారని ఆ పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. నిజాం మీకు బాద్ షా అయితే రజాకార్లు సోదరులా అని నాగం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు రజాకార్లకు ఓటు వేయరన్నారు. బీజేపీ మద్దతుతో తెలంగాణ వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications