హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ, ఏపీ ఎమ్మెల్సీ ఫలితాలు: కాకినాడలో బాబు, హైద్రాబాద్‌లో కేసీఆర్‌కు షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు బుధవారం వెల్లడవుతున్నాయి. పలుచోట్ల కౌంటింగ్ జరుగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్, ఖమ్మం - నల్గొండ - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే ఏపీలోని కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటి లెక్కింపు బుధవారం జరుగుతోంది.

Chandrababu Naidu

గుంటూరు - కృష్ణా టీడీపీ అభ్యర్థి రామకృష్ణ గెలుపు

గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్తి రామకృష్ణ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన గెలుపుపై ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం 13,047 ఓట్లకు గాను ఆయనకు 6,980 ఓట్లు వచ్చాయి. ఆయనకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. లెఫ్ట్ అభ్యర్థి లక్ష్మణ రావుకు 5వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రామకృష్ణ తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు.

ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థి వెనుకంజ

ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి చైతన్య రాజు కంటే యూటీఎఫ్ అభ్యర్థి రామసూర్యారావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 5443, యూటీఎఫ్ అభ్యర్థికి 7,663 ఓట్లు వచ్చాయి.

హైదరాబాద్ - రంగా రెడ్డి - మహబూబ్ నగర్

హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలలో బీజేపీ, తెరాస మధ్య పోటీ కనిపిస్తోంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో... బీజేపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్ర రావుకు 13,205 ఓట్లు, తెరాస బలపరిచిన అభ్యర్థి దేవీప్రసాద్‌కు 10,314 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 749 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండులో 2400 ఓట్లు చెల్లనివి, 115 నోటా ఓట్లు వచ్చాయి. తొలి రౌండులో బీజేపీ అభ్యర్థికి 2891 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి రాంచంద్ర రావు 6వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. రౌండ్ రౌండ్‌కు బీజేపీ అభ్యర్థి దూసుకు పోతున్నారు.

English summary
MLC elections verdict today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X