హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ హత్య: సోదరికి ఎమ్మెమ్మెస్ పంపించాడు, విడాకులే

By Srinivas
|
Google Oneindia TeluguNews

MMS helps nab techie’s killer
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల క్రితం అదృశ్యమైన టెక్కీ చంద్రశేఖర్ వికారాబాద్ అడవుల్లో విగతజీవుడుగా మంగళవారం కనిపించాడు. చంద్రశేఖర్‌ను అతని బావమరిది (మొదటి భార్య సోదరుడు) కిరాయి గూండాలతో హత్య చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడి ఫోన్‌లోని ఎమ్మెమ్మెస్ క్లిప్ ద్వారా కేసును ఛేదించారు. అంతేకాదు అతను ఫేస్‌బుక్‌లోను దీనిని షేర్ చేశాడట.

చంద్రశేఖర్‌ను హత్య చేసిన కిరాయి హంతకులు రుజువుగా ఓ క్లిప్ వీడియో తీసి పంపించారు. దీంతో పోలీసులు కేసును సులభంగా ఛేదించారు.

చంద్రశేఖర్ బికె గూడలో ఉంటూ ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను గత బుధవారం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ బావమరిది, మరికొందరు కలిసి అతనిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం విచారణలో వీడియో ఎమ్మెమ్మెస్ క్లిప్ ద్వారా వారిని నిందితులుగా గుర్తించారు.

చంద్రశేఖర్ నాలుగేళ్ల క్రితం సంధ్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. నిత్యం గొడవల కారణంగా ఇరువురు విడిపోయారు. చంద్రశేఖర్ ఆ తర్వాత లావణ్య అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

ట్విస్ట్

చంద్రశేఖర్‌ను హత్య చేసిన అనంతరం హంతకులు రుజువుగా ఇందుకు సంబంధించి వీడియోను తీసి అతని బావమరిదికి ఎమ్మెమ్మెస్ క్లిప్‌ను పంపించారు. అతను ఆ క్లిప్‌ను తన సోదరి సంధ్యకు పంపించాడు. చంద్రశేఖర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం హత్యకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ తల్లి గురువారం రోజు పోలీసులను ఆశ్రయించారు.

English summary
Chandrashekhar, a techie from Sanjeev Reddy Nagar who had been missing for a week, was found murdered in a forest at Vikarabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X