ఎంప్లాయిస్ ట్రైన్ పై నరేంద్రమోడీ చల్లనిచూపు
హైదరాబాద్ నగరవాసులకు ఎంఎంటీస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి రాత్రి 10.30 గంటల తర్వాత తిరగవు. మెట్రో హైదరాబాద్ సిటీ వరకే పరిమితమవుతుంది. శివారు ప్రాంతాలకు వెళ్లాలంటే ఎంఎంటీస్ ఉండాలి. తక్కువ ఛార్జీతో వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. రాత్రివేళ స్టేషన్లకు చేరుకునే ప్రయాణికుల ఇక్కట్లను తప్పించేలా అర్థరాత్రి సమయంలో కూడా ఎంఎంటీఎస్ రైళ్లను తిప్పాలని అధికారులు యోచిస్తున్నారు.
సికింద్రాబాద్, కాచిగూడ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలకు అనుకూలంగా ఉండేలా ఎంఎంటీఎస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్వయంగా వెల్లడించారు. విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందేభారత్ రైళ్లన్నీ రాత్రి 11.00 గంటల తర్వాతే స్టేషన్ కు చేరుకుంటున్నాయి. నగరంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్న విషయాన్ని జీఎం దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. అర్థరాత్రి కూడా సర్వీసులు తిప్పడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

విజయవాడ - లింగంపల్లి మధ్య తిరిగే ఎంప్లాయిస్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కూడా రాత్రి 10.30 తర్వాతే సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుతోంది. అయితే మౌలాలి వద్దకు 10.15 గంటలకే వస్తుండగా సిగ్నల్ ఇవ్వక గంట సమయం తర్వాతే స్టేషన్ కు చేరుకుంటోందనే విషయాన్ని కూడా జీం ప్రస్తావించారు.
వెంటనే స్టేషన్ లోకి ప్రవేశించేలా చూడటంతోపాటు లింగంపల్లి వరకు వెళుతున్నా అన్ని స్టేషన్లలో ఆగదని, కాబట్టి ఈ రైలు సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులను తిప్పుతామన్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా, హైదరాబాద్ కు ఎంఎంటీఎస్‌లుండేలా చూడనున్నారు. సిగ్నలింగ్ సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని, శివార్లలో ఎక్కువ సమయం రైళ్లను నిలిపే పరిస్థితి రాకుండా చర్యలు చేపడుతున్నామని జీఎం అన్నారు.












Click it and Unblock the Notifications