బైక్ జారిపడి రోడ్డు ప్రమాదంలో మోడల్ మృతి

జూబ్లీహిల్స్‌లో ఓ ఫొటో షూట్‌కు హాజరు కావడానికి మనీష్ లోయా అనే మోడల్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు హిమాయత్‌నగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరాడు. మర్నాడు తెల్లవారు జామును రెండు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి బయలుదేరాడు. బంజారాహిల్స్‌లోని గ్రీన్ మసీద్ వద్ద అతని హీరో హోండా హంక్ జారి పడింది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మనీష్ లోయా అక్కడికక్కడికే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
దంపతులపై దాడి చేసి బంగారం చోరీ
నలుగురు దోపిడీ దొంగలు గురువారంనాడు దంపతులపై కారం పొడితో దాడి చేసి వారి నుంచి ఆరు తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు. ఈ సంఘటన హైదరాబాదులోని నాగారంలో జరిగింది. నాగారం అవుట్ పోస్టు వెనక కుటుంబరావు, భగవతి దంపతులు నివసిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల సమయంలో షోరూం పెట్టడానికి స్థలం కావాలనే సాకుతో నలుగురు దొంగలు వారి ఇంటికి వెళ్లారు. సెకన్ల వ్యవధిలో వారు దంపతుల కళ్లలో కారం చల్లి బంగారం గొలుసును, బంగారు గాజులు బలవంతంగా లాక్కుని పారిపోయారు.












Click it and Unblock the Notifications