• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆదివారమే మోదీ ఏపి ప‌ర్య‌ట‌న‌..! నిరసన సెగ‌ త‌ప్ప‌దా..??

|
  The Excitement Continues On The AP Tour Of Modi | Oneindia Telugu

  గుంటూరు/హైద‌రాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొన‌సాగుతున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న పై ఉత్కంఠ నెల‌కొంది. మొన్న ప‌లాస‌లో బ‌హిరంగ స‌భ‌ను సైతం ర‌ద్దు చేసుకున్న బీజెపి జాతీయ అద్య‌క్షుడు అమిత్ షా ఏపి ప‌ర్య‌ట‌నను హ‌డావిడిగా ముగించిన విష‌యం తెలిసిందే..! ఇక ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి ఏమి చేశారనే అంశాలపై గుంటూరు సభలో ప్రధాని ప్రసంగం ఉంటుందని కన్నా చెప్పారు. ప్రధాని మోడీ సభను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని, తమను ఇబ్బందులకు గురి చేస్తోందని కన్నా ఆరోపించారు. అయితే టీడీపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగ ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూసినా మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

   Modi ap tour on Sunday..! Public may reject modi tour..!!

  గుంటూరులో ప్రకాష్ హోర్డింగ్స్ పై బ్యానర్లు కడుతుంటే లోకేష్ కార్యాలయం నుంచి బెదిరింపులు రావ‌డం చాలా దారుణమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మన రాష్ట్రానికి దేశ ప్రధాని వస్తుంటే ఇలాంటి డ్రామా కంపెనీ ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని, దేశ ప్రధానికి స్వాగతం పలకలేని పరిస్ధితిలో చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు. పేదరిక నిర్మూలన, దేశరక్షణ, గ్రామ వికాశాలపై శ్రద్ధ తీసుకున్న నరేంద్రమోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని కన్నా పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ చేయించిన వ్యక్తి ప్రధాని మోడీ అని కన్నా కొనియాడారు. విభజన చట్టంలోని అంశాలు పది సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఉన్నా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసిన వ్యక్త మోడీ అని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Prime Minister Narendra Modi's visit when emotions are on the peak level at AP. The BJP national president Amit Shah, who had canceled the public meeting in the Palasa, last time. All the arrangements have been made to Prime Minister Narendra Modi's visit to Guntur on 10th of this month, said Bharatiya Janata Party president Kanna Laxmanarayana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more