వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుకు మోదీ కౌంట‌ర్‌: అందుకే ఈవీఎంలపై నింద‌లు : ఫ‌లితం తెలిసిపోయింది...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో పోలింగ్ నాటి నుండి చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌లకు ప్ర‌ధాని మోదీ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబు జాతీయ రాజకీయాలు.. ఈవీఎంల‌పైన ఆరోప‌ణ‌లు..ఎన్నిక‌ల ఫ‌లితాల పైన చేస్తున్న వ్యాఖ్య‌ల పైన ప్ర‌ధాని స్పందించారు. చంద్ర‌బాబుకు అస‌లు విష‌యం అర్ద‌మైపోయింద‌ని వ్యాఖ్యానించారు.

అందుకే ఈవీఎంల‌పై నింద‌లు..

అందుకే ఈవీఎంల‌పై నింద‌లు..

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పైన ప్ర‌ధాని మోదీ స్పందించారు. సీఎం చంద్ర‌బాబ ప‌ర్య‌ట‌న‌ల పైనా వ్యాఖ్యలు చేసారు. సార్వ్ర‌త్రిక ఎన్నిక‌ల్లో తొలి మూడు ద‌శ‌ల్లో జ‌రిగిన పోలింగ్ స‌మ‌యంలో త‌న‌ను లక్ష్యంగా చేసుక‌ని చంద్ర‌బాబు తిట్ట‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న‌న్నారు. అయితే, ఇప్పుడు గాలి ఎటు వీస్తుందో తెలిసి ఈవీఎంల పైన నిందలు వేస్తున్నార‌ని విమర్శించారు. క్రికెట్‌లో కొన్నిసార్లు ఔట‌యిన బ్యాట్స్‌మెన్ అంపైర్‌ను త‌ప్పుబట్టిన‌ట్లుగా ఇప్పుడు చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుబ‌డుతున్నారంటూ మోదీ కౌంట‌ర్ ఇచ్చారు. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబును ఉద్దేశించి మోదీ వ్యాఖ్య‌లు చేసారు. ఆ త‌రువాత ఇప్పుడే తిరిగి చంద్రబాబుకు మోదీ కౌంట‌ర్ ఇచ్చారు.

కొత్త ప్ర‌ధాని ఖాయం..

కొత్త ప్ర‌ధాని ఖాయం..

కొద్ది రోజులుగా చంద్ర‌బాబు ఢిల్లీ..కోల్‌క‌త్తా ప‌ర్య‌ట‌న‌ల్లో ఈనెల 23 త‌రువాత కొత్త ప్ర‌ధాని ఖాయ‌మంటూ ప‌దేప‌దే వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ ఓడిపోతున్నార‌ని..ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అదే విష‌యం స్ప‌ష్ట‌మైందంటూ చంద్ర‌బాబు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. బెంగాల్‌లో జ‌రిగిన ర్యాలీలో సైతం ఢిల్లీ మహిషాసురవ‌ర్దుడిని ఓడించేది మ‌మ‌తానే అంటూ వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో..ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందుగానే కూట‌మిగా ఏర్ప‌డిన‌ట్లుగా రాష్ట్రప‌తిని క‌లిసి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఎవ‌రికీ పూర్తి స్థాయి మెజార్టీ రాక‌పోతే..సింగిల్ లార్టెస్ట్ పార్టీ కాకుండా కూట‌మిని ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని కోరాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం అన్ని పార్టీల నేత‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మీక‌రిస్తున్నారు. కానీ, అందుకోసం తొలుత ఈనెల 21న ముమూర్తంగా నిర్ణ‌యించినా.. అది మ‌రో రోజుకు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

చంద్ర‌బాబు కేంద్రంగా మ‌హాకూట‌మి..

చంద్ర‌బాబు కేంద్రంగా మ‌హాకూట‌మి..

ప్ర‌ధాని మోదీని ప‌ద‌వి నుండి దింప‌ట‌మే కాకుండా..తిరిగి ఆయ‌న ప్ర‌ధాని కాకుండా అడ్డుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. నేరుగా రాహుల్‌తో పొత్తు పెట్టుకొని..ఎక్కువ‌గా జాతీయ రాజ‌కీయాల‌పైనే దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా..ప్ర‌ధాని ఎవ‌ర‌నేది ఫ‌లితాల త‌రువాత డిసైడ్ చేస్తామ‌ని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు బీజేపీ నేత‌లు చంద్ర‌బాబును సైతం ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని చెబుతూనే..చంద్ర‌బాబుకు జాతీయ రాజ‌కీయాల్లో జోక్యం లేకుండా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో..రానున్న వారం రోజుల్లో ఈ ఆరోప‌ణ‌లు..ప్ర‌త్యారోప‌ణ‌లు మ‌రింత ఎక్క‌వ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
Prime Minister Modi counter to TDP Chief Chandra Babu. Modi says Babu know the result that's why he target Election commission. mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X