మోడీ టి టూర్, సిటీలో బాబు, పవన్: వారు రెండేసి చోట్ల
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మంగళవారం ఒక్కరోజే తెలంగాణ ప్రాంతంలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాదు సభల్లో ఆయన ప్రసంగిస్తారు. నాలుగింట రెండు సభల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రెండింట టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
ఒకే వేదిక దానిపై మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే 'భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర' సభలో ఈ ముగ్గురు నేతలు పాల్గొననున్నారు. తెలంగాణలో మోీ మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు నిజామాబాద్, సాయంత్రం 3.15కు కరీంనగర్, 5 గంటలకు మహబూబ్‌నగర్, 6.15 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోడీ పాల్గొంటారు.

నిజామాబాద్, హైదరాబాద్ సభలకు పవన్ కల్యాణ్ కూడా హాజరై ప్రసంగిస్తారు. అలాగే మహబూబ్‌నగర్, హైదరాబాద్ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఈ ముగ్గురు నేతలు మాత్రమే ప్రసంగిస్తారని, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యనేతలకు స్వాగతం చెబుతారని తెలుస్తోంది. మొత్తం నాలుగు సభల్లో ఒక్కో చోట దాదాపు 25 నిమిషాలపాటు మోడీ ప్రసంగించనున్నారు.
మంగళవారం ఉదయం మహారాష్ట్రలో రెండు సభల్లో పాల్గొన్న అనంతరం మోడీ తెలంగాణలోకి అడుగు పెట్టనున్నారు. మోడీతోపాటు ఆ పార్టీ నేతలు మురళీధర్‌రావు, సతీష్‌జీ, ప్రకాశ్ జవదేకర్ కూడా ఆయా సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్‌లో బహిరంగ సభ పూర్తి కాగానే... నరేంద్ర మోడీ నేరుగా గుజరాత్ వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications