ఏపి, టిల్లో ఐఏఎస్,ఐపిఎస్ పంపకాలకు మోడీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాల ఫైలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేశారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాలు జరుగుతున్నాయని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సీనియారిటీ ప్రాతిపదికన రొటేషన్ పద్ధతిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాల ఫైలుపై ప్రధాని సంతకం చేయడంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫైలుపై మంగళవారం సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాంచల్ విడిపోయిన సందర్భంలోనూ ఇదే విధంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పంపకాలు సజావుగా జరగనున్నాయి.












Click it and Unblock the Notifications