అమరావతి రైల్వే లైన్ పనుల్లో వేగం.. మోడీ మార్క్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు కేంద్రం కూడా దృఢ సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని పార్లమెంటు సమావేశాలలోనే స్పష్టం చేసింది. ఇక ఇటీవల అమరావతి రైల్వే లైన్ కోసం కూడా రైల్వే శాఖ వేగంగా పనులను మొదలుపెట్టింది. మోడీ మార్క్ చూపిస్తుంది.
అమరావతి రైల్వే లైన్ కు మరో ముందడుగు
ఈ లైన్ కు సంబంధించి భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన రైల్వే శాఖ రాజధాని అమరావతి వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి పనులు మొదలుపెట్టింది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలని చెప్పిన రైల్వేశాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ఇప్పుడు మరో ముందడుగు పడింది.

భూసేకరణ పనుల కసరత్తు.. ఖమ్మం అధికారి కాంపిటెంట్ అథారిటీ
ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56.53 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టడం కోసం రైల్వే శాఖ కసరత్తును మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
శరవేగంగా అమరావతి రైల్వే లైన్ వర్క్స్
ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వే లైను నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షించనున్నారు.2029 నాటికి రాజధాని అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరో మూడేళ్లలోనే రాజధాని అమరావతికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కూడా పనులను వేగవంతం చేసింది. ప్రస్తుత రాజధాని అమరావతికి రైల్వే లైన్ 450 హెక్టార్ల మేర భూసేకరణ..2600 కోట్ల రూపాయలు ఖర్చు
పనులకు కదలికతో అమరావతి విషయంలో మరొక కీలక అడుగు పడినట్లు అయింది.
ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనున్నారు. ఇక ఈ సింగల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం 2600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమికంగా రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాదు లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్ లోని నంబూరు దగ్గర కలుస్తుంది. మొత్తానికి అమరావతికి రైల్వే లైన్ పనుల్లో ముందడుగు పడడంతో రాజధాని ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications