ప్రత్యక్ష రాజకీయాలకు సెలవ్..!! మోహన్ బాబు సంచలనం : చంద్రబాబు - జగన్ కు అందుకోసమే..!!
ప్రముఖ సినీ నటుడు..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలతో పాటుగా రాజకీయ అంశాలను షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన స్పందించారు. తన ఇంటికి మంత్రి పేర్ని నాని వస్తే పలు రకాలుగా ప్రచారం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. తానే మంత్రి నానితో తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని కోరారని చెప్పుకొచ్చారు.

మంత్రి నానితో భేటీలో ఇలా
తామిద్దరం సరాదాగా అనేక అంశాల పైన చర్చించుకున్నామని వెల్లడించారు. అయితే, జగన్ తో జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలల పైన చర్చ జరగలేదన్నారు. సినిమా వాళ్లతో ఏం మాట్లాడారో చెప్పమని.. ఒక మంత్రిని ఎలా అడుగుతామంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. తన ఇంటికి ఆహ్వానించిన అతిధిని గౌరవించామని..అప్పుడప్పుడూ కలుద్దామని అనుకున్నామని చెప్పారు. పేర్ని నాని ప్రభుత్వ ప్రతినిధిగా తనతో మాట్లాడలేదని..ఒక స్నేహితుడిగా వచ్చారని తేల్చి చెప్పారు. ఇక, దీనికి కొనసాగింపుగా తన రాజకీయ భవిష్యత్ పైన స్పందించారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా
తనకు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ..ఆసక్తి లేదని స్పష్టం చేసారు. తనకు చంద్రబాబు... సీఎం జగన్ బంధువుల కావటంతో ప్రచారం చేసానని వివరించారు. చంద్రబాబుకు గతంలో చేసానని....2019 ఎన్నికల్లో జగన్ కు ప్రచారం చేసానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను సినిమా వ్యవహారాలు.. తన యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నానని చెప్పారు. దీంతో..ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని అనుకుంటున్నానంటూ వెల్లడించారు. ఎన్టీఆర్ హయాంలో మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి..ఆ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసారు. జగన్ సీఎం అయిన తరువాత మోహన్ బాబుకు తిరిగి కీలక పదవి వస్తుందని అందరూ అంచనా వేసారు.
Recommended Video

సినిమాలు - విద్యా సంస్థల పైనే ఇక...
నామినేటెడ్ పదవుల్లో భాగంగా టీటీడీ ఛైర్మన్ లేదా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ వంటి పదవులు వస్తాయనే ప్రచారం సాగింది. కానీ, ఆయనకు ఏ పదవీ దక్కలేదు. కానీ, మోహన్ బాబు మాత్రం తాను జగన్ సీఎం కావాలని కోరుకున్నానని...జగన్ సీఎం అయ్యరు...అది చాలంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇక, ఢిల్లీకి వెళ్లి కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ, దీని పైన మోహన్ బాబు బీజేపీలో భవిష్యత్ లో చేరేదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ప్రధాని పైన అభిమానం ఉందని..ఆయనకు తనంటే అభిమానం ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక, ఇప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో దూరంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పటం ద్వారా...మోహన్ బాబు నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications