• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ వ్యూహం: మరోసారి చంద్రబాబును దెబ్బ తీయడానికే కలిసిన మోహన్ బాబు?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుణ్ని న‌టుడు మోహ‌న్‌బాబు రెండురోజుల క్రితం క‌ల‌వ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బాబును కలవడం వెనక ''రాజకీయ వ్యూహం'' దాగివుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాబును కలిసిన విష‌య‌మై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ సాయిబాబా దేవాల‌యం ప్రారంభానికి ఆహ్వానించారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌య‌మై మోహ‌న్ బాబు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

 మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు


తెలుగు త‌మ్ముళ్లు మాత్రం దీనిపై మండిప‌డుతున్నారు. గ‌తంలో టీడీపీ ఓట‌మికి ఆయ‌న కూడా కొంత కార‌కుడ‌ని, మోహన్ బాబును పార్టీలో చేర్చుకుంటే కాపు సామాజిక‌వ‌ర్గం దూర‌మ‌వుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌ల‌ జ‌రిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో తన కొడుకు విష్ణు గెలుపు కోసం ఆయన బాల‌కృష్ణ ను ఆశ్ర‌యించారని, ఆ స‌మ‌యంలో విష్ణుకు ప్రత్యర్థిగా పోటీచేస్తున్న ప్ర‌కాష్ రాజ్‌కు చిరంజీవి వ‌ర్గం మ‌ద్ద‌తిచ్చింద‌ని, విష్ణు విజయం సాధించిన తర్వాత కాపులంతా మోహ‌న్ బాబుపై తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెబుతున్నారు.

 కాపుల్లో వ్యతిరేకత తీసుకురావడంద్వారా..

కాపుల్లో వ్యతిరేకత తీసుకురావడంద్వారా..


బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడు విజయవంతమవడంతోపాటు ఏ పర్యటనకు వెళ్లినా చంద్రబాబుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో పాటు జనసేనతో కలిసి పొత్తుగా వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనలు సాగుతున్నాయి. చివరి నిముషంలోనైనా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందనే అభిప్రాయం టీడీపీ, జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కానీ దీన్ని మొదట్లోనే తుంచేసి, కాపు సామాజికవర్గంలో టీడీపీపై వ్యతిరేకత ప్రబలేలా చేయాలనే ''రాజకీయ వ్యూహం''లో భాగంగానే మోహన్ బాబు టీడీపీ అధినేతను కలిశారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 కాపులంతా ఈసారి జనసేన వైపే??

కాపులంతా ఈసారి జనసేన వైపే??


రాబోయే ఎన్నిక‌ల్లో కాపు సామాజిక‌వ‌ర్గం మొత్తం జ‌న‌సేన‌కు ఓటువేసే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ త‌రుణంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ల‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంద‌ని, మోహ‌న్‌బాబును చేర‌దీస్తే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయి త‌ల‌కిందుల‌వుతాయ‌ంటున్నారు. ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ రాలేదంటూ రోడ్డెక్కి ధ‌ర్నాలు చేసిన మోహ‌న్ బాబు త‌న కుమారుడు విష్ణుతో క‌లిసి గత ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. అది ప్రత్యక్షంగా జరిగిందని, ఇప్పుడు కలవడమనేది పరోక్ష యుద్ధమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

English summary
Political analysts are expressing the opinion that there is a "political strategy" behind mohanbabu meet chandraBabu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X