రాజధాని భూముల్లో నల్లధనం, విదేశాల్లో పెట్టుబడి!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో పలువురు భూముల కొనుగోళ్ల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావుకు లేఖ రాశారు.

ప్రభుత్వం సీఆర్డీఏ బృహత్ ప్రణాళికను ఆమోదించకముందే కొన్ని స్థిరాస్థి సంస్థలు సీఆర్డీఏ ఆమోదిత స్థలాలు అంటూ ప్రకటనలు ఇచ్చి కొనుగోలుదారులను మభ్యపెడుతున్నాయని ఫిర్యాదు చేశారు. పలువురు మంత్రులు, శాసన సభ్యులు, పారిశ్రామికవేత్తలు సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లోని భూములను తక్కువ ధరలకే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారన్నారు.

'money lending in ap capital area'

ఎకరం రూ.10 లక్షల లోపు ధరకు కొని.. ప్రస్తుతం వాటిని కోటి రూపాయలకు పైగా విక్రయించ చూస్తున్నారని ఆరోపించారు. అలా నల్లధనాన్ని కూడబెట్టి మారిషస్ లాంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో చాలామంది బినామీలు, అక్రమార్కులు భూములను ముందుగానే కొనుగోలు చేయడం వల్ల వాటి పూర్వపు యజమానులైన నిజమైన రైతులు దారుణంగా నష్టపోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+