కిరాతక టీచర్: నగ్నంగా మోకాళ్లపై నిలబెట్టాడు
విశాఖపట్నం: ఓ ఉపాధ్యాయుడు ఇద్దరు సోదరుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడు విధించిన శిక్షతో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటన మంగళవారంనాడు విశాఖపట్నం జిల్లా భీమిలీ మండలం మరదపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి - సూర్య తేజ నాలుగో తరగతి చదువుతున్నాడు. దిలీప్ కుమార్ ఐదో తరగతి చదువుతున్నాడు. వారిద్దరు అన్నదమ్ములు. అయితే, వారు హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ రాజా వారి పట్ల తీవ్ర ఆగ్రహం చెందారు. చొక్కాలు విప్పేసి ఎండలో నిలబడాలని వారిని అదేశించాడు. మూడు గంటల పాటు అలా నిలుచున్న విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు.

రాణి కుమారి, అనిల్ కుమార్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. వారు ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు. వారిద్దరు కూడా తమను శిక్షించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారని మండల విద్యాధికారి సాయిబాబా చెప్పారు. ఈ సంఘటనపై తాను జిల్లా విద్యాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలితే ఉపాధ్యాయులపై చరయ్లు తీసుకుంటామని డిఇవో ఎంవి కృష్ణా రావు చెప్పారు. తమ పిల్లలు సరిగా చదవడం లేదని, వారిని శిక్షించాలని విద్యార్థుల తల్లితో తనతో చెప్పిందని అనిల్ కుమార్ అంటున్నాడు. ఆ విషయాన్ని పిల్లల తల్లి గ్రామ పెద్దల ముందు అంగీకరించింది.












Click it and Unblock the Notifications