కాంగ్‌పై మోపిదేవి నిప్పులు, జైల్లో జగన్ క్యారెక్టర్ చూశా

Mopidevi Venkataramana
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరగడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రశంసలు కురిపించారు. తనకు సంబంధం లేని కేసుల్లో తనను ఇరికించారని శుక్రవారం మండిపడ్డారు.

జగన్‌ను అరెస్టు చేయాలి కాబట్టి అంతకుముందు తనను బలి చేశారని, బిసిని అయినందువల్లనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేసేందుకే ముందుగా తనను అరెస్టు చేశారనే విషయం అందరికీ తెలుసునన్నారు.

తమ నిర్ణయాలలో సిబిఐ వేటిని తప్పు పట్టిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. న్యాయస్థానంలో ఏమిటో తేలుతుందన్నారు.

తాను జైలులో ఉండగా జగన్‌తో సాన్నిహిత్యం పెరిగిందని ఆయనలో అప్పుడే నాయకత్వ లక్షణాలను చూశానని చెప్పారు. ఆయన నాయకత్వం పైన నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

కాంగ్రెసు పార్టీ సిబిఐను తమకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు. జగన్‌ను ఎదుర్కోలేక కేసులు, అరెస్టులతో ఇబ్బంది పెట్టినా ప్రజలు ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు. జగన్ పైన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి గ్లోబల్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. కాగా మోపిదేవి శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+