దేశంలోని ఈ దేవాలయాలలో ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా!!
బంగారం ఈ పేరు చెబితే చాలు..ప్రతి ఒక్కరి కళ్ళు ఒక్కసరిగా జిగేలుమంటాయి. అటువంటి బంగారం టన్నులు టన్నులుగా మనదేశంలోని ఆలయాలలో ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో భారతదేశంలోని అనేక దేవాలయాలు ఉన్నాయి.
దేశంలోని చాలా దేవాలయాలు ధనిక దేవాలయాలుగా, బంగారం భారీగా ఉన్న దేవాలయాలుగా గుర్తించబడ్డాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అనేక దేవాలయాలలో ఏయే దేవాలయాలలో ఎంత బంగారం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తెలుసుకోవాలనుకునే విషయం. కనక ప్రస్తుతం మన దేశంలో అత్యంత బంగారం ఉన్న దేవాలయాలు వివరాలను తెలుసుకుందాం. దేశంలో ప్రసిద్ధిగాంచిన అనేక పురాతన దేవాలయాలలో సంపద బంగారం రూపంలో ఉంది.
భారతదేశంలో ఉన్న దేవాలయాలలో మొత్తం 2000 నుండి 4000 టన్నుల వరకు బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో అత్యంత సంపన్న హిందూ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి అందరికంటే సంపన్నవంతుడు. గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను ఏర్పాటు చేసి మరీ వజ్రాలు, బంగారు అభరణాలు, బంగారు విగ్రహాలను ఉంచారని శోధనలలో గుర్తించారు. ఇక అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మొత్తం 13 టన్నుల బంగారం ఉందని చెబుతున్నారు.

ఇక అనంత పద్మనాభ స్వామి ఆలయం తర్వాత ఏపీలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుమల శ్రీవారికి 10.3 టన్నుల బంగారం ఉందని చెబుతున్నారు. అంటే తిరుమల శ్రీవారి బంగారం మొత్తం 10,300 కిలోలు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయంలో కూడా 1.2 టన్నుల బంగారం ఉందని, ఆ తర్వాత మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 376 కేజీల బంగారం ఉందని, మహారాష్ట్రలోని సిద్ధి వినాయక ఆలయంలో 120 కేజీల బంగారం ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మన దేశంలో ఆలయాలలో పుష్కలంగా సంపద రూపంలో బంగారం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications