వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జీవీ కి మంత్రి పేర్ని నాని కౌంటర్ : రెమ్యునరేషన్ ఫార్ములా- బ్లాక్ మార్కెటింగ్ అంటారా : వార్ పీక్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ వర్సస్ ఏపీ మంత్రులు కోల్డ్ వార్ పీక్ కు వెళ్తోంది. తాజాగా, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఏపీ సీఎం.. మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలతో టాగ్ చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన అడిగిన వాటికి వరుస ట్వీట్లతో కౌంటర్ చేసారు. అందులో కొన్నింటికి మంత్రి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆర్జీవి చేసిన ట్వీట్లు...ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు సైతం మద్దతు ప్రకటించారు. తన నోటి నుంచి అడగాలని భావిస్తున్న వాటనికి ఆర్జీవీ అడిగారని చెప్పుకొచ్చారు.

Recommended Video

AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu

ఆర్జీవీని పట్టించుకోమని చెబుతూనే


మరో మంత్రి కొడాలి నాని అసలు తాము ఆర్జీవీని పట్టించుకోమని చెప్పగా.. ఇప్పుడ మంత్రి పేర్ని నాని ఇచ్చిన కౌంటర్లు ఆసక్తి కరంగా మారాయి. మంత్రి పేర్ని నాని తన ట్వీట్లలో "మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?.." అంటూ కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా మరో ట్వీట్ లో .." సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.." అంటూ చెప్పుకొచ్చారు.

ప్రేక్షకుల గురించి ఆలోచించండీ

ఇక, ఆర్జీవి నిత్యావసరాల గురించి ప్రస్తావించగా.. దానికి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. " ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు..." అంటూ వివరించారు. దీనికి కొనసాగింపుగా.." బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ..." అంటూ పేర్ని నాని సూచించారు.

సినిమా నిత్యావసరంగా భావిచటం లేదు


ఇక, దీనికి కొనసాగింపు ట్వీట్ లో అత్యవసర సర్వీసు గురించి ఆర్జీవి వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. " సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు" అని తేల్చి చెప్పారు. " థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు"..అంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు.

సామాన్యుడిని దోచుకోకూడదనే

సామాన్యుడిని దోచుకోకూడదనే


ఇక, ప్రజలు అధికారం ఇచ్చారని... నెత్తిన ఒక్కి తొక్కటానికి కాదంటూ ఆర్జీవి చేసిన కామెంట్స్ కు మంత్రి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీనికి బదులుగా .." మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?.." అని మంత్రి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. ఇక, ఈ వ్యవహారం ముదురుతున్న ఈ వేళ..మంత్రి పేర్ని నాని ట్వీట్లకు ఇప్పుడు ఆర్జీవి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జీవీ స్పందన ఏ విధంగా ఉంటుందో... తిరిగి మంత్రి ఏ రకంగా రియాక్ట్ అవుతారో.. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొత్తగా ఎవరు ఎంటర్ అవుతారనేది అటు టాలీవుడ్.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Amid the ongoing war between movie incustry and AP govt over tickets issue, Minister Perni nani gave a counter to RGV who had poked his nose into the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X