పేర్ని నాని మొత్తం ఆగం చేశారు..!

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు. గురువారం ఎంపీ బాలశౌరి బందరు మున్సిపల్‌ కమిషనర్‌, పలువురు ఇంజినీర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మచిలీపట్నంలో పెండింగ్‌లో ఉన్న పనులు, నిధులు, తదితర విషయాల గురించి ఆరా తీయగా.. మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అభివృద్దికి అడ్డుపడిన వైనాన్ని ఆయన గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌ 2.0 కింద దాదాపు 57.33 కోట్ల నిధులు ఏడు, ఎనిమిది నెలల కిందట మంజూరు కాగా.. ఆ నిధులకు కనీసం అనుమతులు ఇవ్వలేదని అధికారులు ఎంపీ బాలశౌరి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. మచిలీపట్నం పట్టణం అభివృద్ది చెందకుండా అడ్డుకోవాలని అనుకోవడం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని దుర్మార్గానికి నిదర్శనం అని ఆయన అన్నారు. కేంద్ర నుంచి ఏ నిధులు వచ్చిన ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం జరిగిందని అందుకో ఇవాళ చిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడని ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. అమృత్‌ 2.0 కింద ఎనిమిది నెలల కిందటే రూ.57.33 కోట్ల నిధులు వస్తే అధికారులకు అనుమతులు ఇవ్వవద్దని ఓ నియంతలా మారిన మాజీ ఎమ్మెల్యే బాగోతాన్ని ప్రజలందరూ గ్రహించాలని తెలిపారు.

mp balasouri slams on ex mla perni nani

మచిలీపట్నం ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు మాజీ ఎమ్మెల్యే ప్రజలపై పగబట్టారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. బందరు ప్రాంతం గత అయిదేళ్లుగా అభివృద్ది చెందకుండా పేర్ని నాని అధికారులపై తీవ్రమైన ఒత్తిడి చేశారని ఎంపీ ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన బాలశౌరి ..ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి మచిలీపట్నం ఎంపీగా మరోసారి విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+