అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ, అమరావతికి భారీ పెట్టుబడులు: గల్లా జయదేవ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నం, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కేంద్రంగా సేవారంగంలో పెట్టుబడులు వస్తాయని భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాయలసీమ కేంద్రంగా పారిశ్రామిక
పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

కోస్తా ప్రాంతంలో కూడా ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో అమర్ రాజా గ్రూప్ ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెడతామని జయదేవ్ చెప్పారు.

MP Galla jayadev says investments will come Amaravati and Vizag

కాగా, విశాఖపట్నం-చెన్నై కారిడార్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఏడీబీ డైరెక్టర్ తెరేసోఖో అన్నారు. సోమవారం ఆయన భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ వీసీఐసీ పరిధిలో విశాఖపట్నం-కాకినాడ, కంకిపాడు-గన్నవరం, ఏర్పేడు-కాళహస్తి పారిశ్రామిక నోడ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

వీసీఐసీ ఏర్పాటుకు 840 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వీసీఐసీతో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతుందని ఆయన పేర్కొన్నారు.

English summary
MP Galla jayadev says investments will come Amaravati and Vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X