ఆయనతోనే సాధ్యం: చంద్రబాబుపై జేసీ ప్రశంసల వర్షం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోందని అన్నారు.
ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక, రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి చంద్రబాబునాయుడు సీఎం కావాలని అన్నారు.

చంద్రబాబు తప్ప ఏ నాయకుడు వచ్చినా రాష్ట్రానికి న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలు వెడల్పు పనులు వేగవంతం చేసి, ఎక్కువ నీటిని తీసుకురావాలని సీఎం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు వల్లే రాయలసీమకు నీరు వస్తోందని దివాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications