ముద్దపప్పు.. నోరు అదుపులో పెట్టుకో.. లోకేష్ కు ఎంపీ మార్గాని భరత్ వార్నింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా వైయస్సార్సీపి, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న వార్ రోజురోజుకు పెరుగుతుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో నారా లోకేష్ కు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ వేశారు.
టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ముద్దపప్పు లోకేష్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన, లోకేష్ బ్రాహ్మణి భర్తగా, బాలకృష్ణ అల్లుడిగా, చంద్రబాబు కొడుకుగా తప్ప తనకంటూ ఏ విధమైన ప్రత్యేక అర్హత లేని వ్యక్తి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడటం విడ్డూరమని మార్గాని భరత్ మండిపడ్డారు.

అర్ధరాత్రి పాదయాత్ర చేసే వ్యక్తి లోకేష్ అంటూ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని నారా లోకేష్ సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడు పగటిపూట పాదయాత్రలు చేస్తారని, కానీ లోకేష్ తెల్లవారుజామున పాదయాత్రలు చేయడం హాస్యాస్పదం అంటూ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు.
ఓయ్.. ముద్ద పప్పు.. నోరు లేస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో అంటూ మార్గాని భరత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిడ్నైట్ పాదయాత్రలు చేసే ముద్దపప్పు గురించి మాట్లాడి తన స్థాయి తగ్గించుకో లేనని ఆయన పేర్కొన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మార్గాని భరత్ హెచ్చరికలు జారీ చేశారు.
ఒకసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని నువ్వు ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. అసలు నీ పాదయాత్ర లక్ష్యం ఏమిటో నీకైనా తెలుసా అంటూ లోకేష్ పై విమర్శలు గుప్పించిన ఆయన యువ గళమా.. గందరగోళమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అర్ధరాత్రి మూడింటికి పాదయాత్ర ఏమిటని ప్రశ్నించిన ఆయన, అర్ధరాత్రి పాదయాత్ర వల్ల నీ ఒళ్ళు, కొవ్వు తగ్గి నీకు ఉపయోగమే జరుగుతుంది లే అంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications