మిధున్ హాజరైన వేళ అనూహ్య పరిణామాలు- నెక్స్ట్ ఇక..!!
లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. ఈ రోజు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతితో తన న్యాయవాదితో మిథున్ రెడ్డి సిట్ విచారణకు వచ్చారు. కాగా, మిథన్ రెడ్డి పాత్ర గురించి సిట్ అధికారులు సాయిరెడ్డిని ఆరా తీసారు. ఈ మొత్తం లిక్కర్ వ్యవహారం రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని సాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు మిథున్ రెడ్డి హాజరు తో రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
సిట్ విచారణకు
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది సోడిశెట్టి మన్మధ రావు హాజరయ్యారు. కాగా.. సిట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అంగీకరించింది.

కోర్టు ఆదేశాలతో
అదే సమయంలో విచారణకు న్యాయవాది ఆటంకం కలిగించవద్దని.. పది అడుగుల దూరంలో లాయర్ ఉండేలా అవకాశం కలిపిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మరో వైపు ఇప్పటికే లిక్కర్ కేసు లో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కీలక అంశాలను వెల్లడించారు. లిక్కర్ కేసులో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి అని తేల్చి చెప్పారు. తన నివాసంలో జరిగిన లిక్కర్ పాలసీ రూపకల్పన చర్చ మొదలు.. తాను డబ్బులు ఇప్పించిన అంశాల వరకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారం వెనక క్రిమినల్ మాస్టర్ మైండ్ మాత్రం రాజ్ కసిరెడ్డిదే అని మీడియాతో చెప్పుకొచ్చారు.అలాగే రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు.

హైకోర్టుకు కసిరెడ్డి
విచారణలో భాగంగా కసిరెడ్డి తండ్రిని సిట్ పలు ప్రశ్నలు సంధించింది. రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు.. ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని, కేవలం భార్యకు మాత్రమే మెసేజ్ చేస్తారని సిట్ అధికారులకు చెప్పారు. ఇక ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రాజ్‌కసిరెడ్డికి కూడా దాదాపు మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. అసలు ఎవరీకి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ అని వచ్చాయి. దీంతో రాజ్ కసిరెడ్డి తండ్రిని విచారించారు సిట్ అధికారులు. ఇక, ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావటంతో.. చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications