అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!!

అమరావతి కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్ట బద్దత కల్పిస్తూ పార్లమెంట్ లో కేంద్రం బిల్లు ప్రతిపాదించింది. లోక్ సభలో చర్చ కోసం రెండు గంటల సమయం ఇచ్చారు. కాంగ్రెస్.. సమాజ్ వాదీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. వైసీపీ ఈ బిల్లు పైన తమ విధానం స్పష్టం చేసింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే... ఈ తరహా బిల్లులో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. అమరావతి రైతులకు ఇచ్చిన హామీల అమలు... ఖర్చు.. నిధుల పైన ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభ నుంచి వాకౌట్ చేసింది.

పార్లమెంట్ లో అమరావతికి చట్ట బద్దత కల్పించే బిల్లు పైన చర్చ జరుగుతోంది. వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి తమ పార్టీ వైఖరి స్పష్టం చేసారు. అమరావతిలో రైతులను భూములు సమీక రించిన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. అమరావతికి కావాల్సిన నిధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని.. కొందరు కాంట్రాక్టర్లకు అవీతినికి చిరునామా గా మారుతోందని విమర్శించారు. అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది.. ఎంత ఖర్చు చేస్తారు.. ఎక్కడ నుంచి నిధులు తీసుకొస్తారనేది స్పష్టత లేదని మిథున్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బిల్లు స్వరూపం సరికాదని.. అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే.. ఈ బిల్లును యధాతధంగా ఆమోదించేందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేసారు. ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసారు.

mp-mithun-reddy-clarifies-ysrcp-view-over-amaravati-legislation-bill-in-loksabha-here-the-details

అమరావతికి అనుకూలమే.. బిల్లు స్వరూపం కు వ్యతిరేకం

బిల్లు స్వరూపం పైన మిథున్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే.. ఈ బిల్లుతో ప్రజలకు ప్రయోజనం లేదని చెప్పారు. ఈ చట్ట సవరణ బిల్లుతో ఏపీకి ఏం ప్రరయోజనం ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు. రైతులకు భూములకు బదులుగా ప్లాట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు వాటిని పంపిణీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అమరావతిలో కేవలం రూ 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసారని చెప్పారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. రైతులు తమ భూముల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఏపీ అప్పుల్లో ఉందని.. ఈ పరిస్థితుల్లో అమరావతిలో చేసే ఖర్చు.. సెల్ఫ్ పైనాన్స్ ప్రాజెక్టుగా చెబుతున్న ప్రభుత్వం.. ఈ నిధుల సమీకరణ పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం బిల్లు స్వరూపం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రైతులకు స్థలాలు ఎప్పుడు ఇస్తారో తేదీ చెప్పాలని డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+