బోస్ వర్సస్ వేణు ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్, త్రిమూర్తులకు పిలుపు - కీలక నిర్ణయం..!!
ఎంపీ బోస్ వర్సస్ మంత్రి వేణు ఎపిసోడల్ లో భారీ ట్విస్ట్. ఇద్దరు నేతలు తగ్గేదే లే అంటూ సీటు పైన ప్రకటనలు చేయటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పిలుపు వచ్చింది. ఆయన తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ సమన్వయకర్త మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపురం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దశలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
తీవ్ర స్థాయికి కోల్డ్ వార్ : మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని బోస్ సంచలన ప్రకటన చేశారు.

సీఎం జగన్ ఉన్నంత కాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా స్పష్టం చేశారు. తాడేపల్లికి వచ్చి సీఎంతో మాట్లాడిన తరువాత బోస్ చేసిన ప్రకటనతో వైసీపీ నాయకత్వం గుర్రుగా ఉంది. అదే సమయంలో మంత్రి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం వివాదంగా మారుతోంది.
తోట త్రిమూర్తులతో చర్చలు : ఈ సమయంలో రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలంలో మిథున్ రెడ్డితో తోట త్రిమూర్తులు సమావేశమయ్యారు. తోట త్రిమూర్తులు 1994లో స్వతంత్ర అభ్యర్ధిగా, 1999, 2004, 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచారు.
2014లో టీడీపీలో చేరి అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీలో చేర సమయంలో వచ్చే ఎన్నికల్లో..ఆ తరువాత రెండు సార్లు వరుసగా మంత్ర వేణు పోటీకి త్రిమూర్తులు అంగీకరించారు. అప్పుడు త్రిమూర్తులుకు మండపేట కేటాయించి శాసనమండలికి పంపారు. ఇప్పుడు రామచంద్రాపురంలో ఇద్దరు ముఖ్య నేతల వివాదం సమయంలో తోట త్రిమూర్తులతో చర్చ ఆసక్తి కరంగా మారింది.

సీఎం జగన్ పర్యటన వేళ : తోట త్రిమూర్తులకు రామచంద్రాపురం నియోజకవర్గం పైన పూర్తి పట్టు ఉంది. ఇప్పుడు ఈ వివాదం కారణంగా తిరిగి ఆయన్ను రామచంద్రాపురం తీసుకొచ్చే అవకాశం లేదు. నియోకవర్గంలోని పరిస్థితుల పైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో మంత్రి..వర్సస్ ఎంపీ వివాదం సమస్యగా మారింది.
ముఖ్యమంత్రి జల్లా పర్యటన వేళ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన తోట త్రిమూర్తులతో చర్చించినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ అమలాపురం చేరుకొనే లోగానే వేణు వర్సస్ బోస్ వివాదం సమిసిపోయేలా మిథున్ రెడ్డి, త్రిమూర్తులు చొరవ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే...సీఎం జగన్ పర్యటన ముగిసిన తరువాత కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీలో చర్చ సాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications