రఘురామ టార్గెట్ సజ్జల -హైకోర్టులో పిల్ : ఆయన చేస్తుంది ఇదే : కట్టడి చేయండి- చర్యలకు ఆదేశించండి..!!

ఇప్పటికే సీఎం జగన్...ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జలను టార్గెట్ చేసారు. తాజాగా సజ్జల ను నిలువరిస్తూ..ఆయన పైన చర్యలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలు చేసారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా వ్యవహరిస్తూ ఆయన ప్రభుత్వం నుంచి నెలకు రూ 2.50 లక్షల జీతం తీసుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

సజ్జల ప్రభుత్వ వేతనం తీసుకుంటూ..

సజ్జల ప్రభుత్వ వేతనం తీసుకుంటూ..

దీనికి అదనంగా మరిన్ని బాధ్యతల పేరుతో మరో రూ 2.5 లక్షలు డ్రా చేస్తున్నారని అందులో వివరించారు. అయితే, ప్రభుత్వ ఆయన్ను ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ అందులో పలు నిబంధనలు పేర్కొన్ని విషయాన్ని రఘురామ ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న వారికి ఏపీ సీవిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి నిర్ధిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలని.. సివిల్ సర్వెంట్ల తరహాలో సలహాదారులు సైతం నిజాయితీగా.. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తన పిటీషన్ లో వివరించారు.

ప్రభుత్వ వేతనం..పార్టీకి సేవలు

ప్రభుత్వ వేతనం..పార్టీకి సేవలు

సజ్జల వైసీపీ పార్టీ కి చెందిన వారని...ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. .మూడు జిల్లాలకు ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్నారని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ తరపున రాజకీయ పాత్ర పోషిస్తున్నారంటూ పిటీషన్ లో వివరించారు. సలహాదారుడిగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ అందులో పొందు పరిచారు. ఆయన నియామక ఉద్దేశాలకు విరుద్దంగా పని చేస్తున్నారని..వైసీసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాంటూ సుదీర్ఘంగా వివరించారు.

సజ్జలకు సివిల్ సర్వీసు రూల్స్ వర్తిస్తాయంటూ..

సజ్జలకు సివిల్ సర్వీసు రూల్స్ వర్తిస్తాయంటూ..

సలహాదారులకు ప్రత్యేక నియమావళి లేదని చెబుతూ.. వారికి సివిల్ సర్వీసెస్ రూల్స్ వర్తిస్తాయని తన పిటీషన్ లో రఘురామ స్పష్టం చేసారు. వీటిని పరిగణలోకి తీసుకొని సజ్జల పైన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ రాజు తన పిటీషన్ లో హైకోర్టును కోరారు. ఇక, ఇప్పటికే సీఎం జగన్..ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ల పైన సీబీఐ కోర్టులో విచారణ పూర్తయింది. రెండు పిటీషన్లలో ఒకే విధమైన అంశాలు ఉండటంతో వీటి పైన ఒకే సారి ఈ నెల 25న తీర్పు ఇస్తామని కోర్టు వెల్లడించింది.

రఘురామ విమర్శలు..వైసీపీ లైట్ తీసుకుంటుందా

రఘురామ విమర్శలు..వైసీపీ లైట్ తీసుకుంటుందా

ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సమయంలో ఇప్పుడు రఘురామ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జల పైన హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. రాజకీయంగా సజ్జల పైన రఘురామ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. రఘురామ విమర్శల పైన అప్పట్లో సజ్జల తీవ్రంగా రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలు..విమర్శల పైన వైసీపీ నేతలు పెద్దగా స్పందించటం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ అక్కడి నుంచే ప్రభుత్వ నిర్ణయాలు...విధానాల పైన టార్గెట్ చేస్తున్నారు.

Recommended Video

    AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
    సీబీఐ కోర్టు తీర్పు పై ఉత్కంఠ..ఆ తరువాతనే

    సీబీఐ కోర్టు తీర్పు పై ఉత్కంఠ..ఆ తరువాతనే

    అయితే, వైసీపీ నేతలు మాత్రం రఘురామ పైన తాము స్పీకర్ కు ఇచ్చిన అనర్హత పిటీషన్ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే ధీమాతో కనిపిస్తున్నారు. రఘురామ మాత్రం తన పైన చర్యలు ఉండవని స్పష్టంగా చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కోర్టుల్లో కేసుల ద్వారా రఘురామ వైసీపీ ముఖ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెల 25న సీబీఐ కోర్టు జగన్ - సాయిరెడ్డి బెయిల్ రద్దు కేసులో తీర్పు ఇచ్చిన తరువాత ఈ పరిణామాలు కొత్త మలుపు తీసుకొనే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+