శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దళిత యువకుడి శిరో ముండనం కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఈ రోజు ఢిల్లీ లో నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో తీవ్ర విమర్శలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు .ఏపీలో అధికార పార్టీ నేతల తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో ఈరోజు రాజధాని ప్రాంత రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిని అరెస్టు చేయడం, వారిపై దాడికి పాల్పడడం దారుణమని రఘురామ వ్యాఖ్యానించారు. రాజధాని అంశంపై కూడా మాట్లాడారు.

రచ్చ బండలో శిరోముండనం కేసుపై రఘురామ వ్యాఖ్యలు
శిరోముండనం కేసుపై సీఎం జగన్ స్పందనకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ధన్యవాదాలు తెలిపారు . లేటుగానైనా లేటెస్టుగా సీఎం జగన్ స్పందించినందుకు ధన్యావాదాలన్న ఆయన శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక ఆసక్తికర అంశాలపై మాట్లాడారు . ముఖ్యంగా శిరో ముండనం కేసునుద్దేశించి ఆ ఘటన వెనుక పార్టీలోని అతి ముఖ్యుడు , మీ సమీప బంధువు వున్నారని తనకు తెలిసిందన్నారు రఘురామ.

అతి దగ్గరగా ఉండి అతి చేసే ఆ నాయకుడిపై చర్యలు తీసుకోండి
ఆయనే ఇన్ స్పెక్టర్‌తో మాట్లాడారని , శిరోముండనం చేయించమని చెప్పకపోయినా, తీవ్రంగా దండించమని చెప్పినట్టున్నారు అంటూ వ్యాఖ్యానించారు .సీఎం జగన్ బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి అతీతంగా ఉంటానని చెప్పారు కాబట్టి చెబుతున్నానంటూ పేర్కొన్న రఘురామ కృష్ణం రాజు ఆ వ్యక్తి ఎవరో తనకు తెలుసునని సీఎం జగన్ నిజనిర్ధారణ చెయ్యాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో బంధుప్రీతిని పక్కన పెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తే మీకు మంచి పేరు వస్తుంది అని పేర్కొన్నారు . రాష్ట్రపతి కార్యాలయం మూడు సార్లు ఆదేశాలు ఇచ్చాక శిరో ముండనం కేసులో సీఎం స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉండి అతి చేసే నాయకుడే ప్రధాన కారణం అని తెలుస్తుందని , ఇప్పటికైనా సీఎం చర్యలకు ఉపక్రమించాలని అన్నారు .

రాజధాని అంశంపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన రఘురామ .. రైతులే గెలుస్తారు
పోలీసులే ఇలా శిరోముండనం చేయించడం భావ్యం కాదన్న రఘురామ కృష్ణం రాజు సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టించటం భావ్యం కాదన్నారు . మరోవైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా రఘురామకృష్ణంరాజు స్వాగతించారు. రైతులు ఆశాభావంతో ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టులో రైతులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మం న్యాయం గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు ఇంతగా బాధపడుతుంటే, కౌలు కోసం నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అన్నారు .
Recommended Video

కౌలు డబ్బులు ఇవ్వలేని వారు మూడు రాజధానులు కడతారా.. రఘురామ ప్రశ్న
సీఆర్డీఏ ఆఫీస్ కి వెళ్ళిన రైతులను అరెస్టు చేసి దాడి చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఇవ్వకుండా, అడిగినందుకు వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఇవ్వలేని వారు మూడు రాజధానులు కడతారా అంటూ ప్రశ్నించారు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని ,ఏపీ ప్రజలు ఇదే అంటున్నారని రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications