హైకోర్టులో రఘురామ పిటీషన్- తోసిపుచ్చిన న్యాయస్థానం : సీఐడీ డీజీకి నోటీసు..!!

సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ రాజు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ జరిగింది. ఈ కేసు తిరిగి ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలని పిటీషనర్ రఘురామ కోర్టును అభ్యర్ధించారు. దీనిని న్యాయస్థానం తోసి పుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

సీఐడీ అదనపు డీజీ పైనా ఆరోపణలు

సీఐడీ అదనపు డీజీ పైనా ఆరోపణలు

ఇదే పిటీషన్ లో ఎంపీ రఘురామ ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పైన తీవ్ర ఆరోరపణలు చేసారు. దీంతో..వీటి పైన స్పందిస్తూ...సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఈమేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి.. సీఐడీ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు ఇచ్చింది.

రాఘురామకృష్ణరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై సీఐడీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని కోర్టుకు నివేదించారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసులు వర్తించవని వాదించారు. ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేస్తే.. ప్రభుత్వం పైన చేసినట్లు కాదని పేర్కొన్నారు.

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

దీనికి స్పందనగా కేసు విచారిస్తున్న న్యాయమూర్తి మానవేంద్రనాధ్ రాయ్ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు, అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తన వాదనల్లో భాగంగా కోర్టుకు నివేదించారు. సీఐడీ తరపు ప్రత్యేక పీపీ చైతన్య తన వాదనలు వినిపించారు.

ఎంపీ రఘురామరాజు పైన నమోదు చేసిన కేసులు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే పది మందికి పైగా సాక్ష్యులను విచారించామని కోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి పైన అనేక అభ్యంతరకత వ్యాఖ్యలు చేసారని..దీని పైన రాష్ట్రంలో నిరనసలు జరిగాయని కోర్టుకు వివరించారు. రఘురామ రాజు సీఐడీ అదనపు డీజీ పైన చేసిన ఆరోపణలపై పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.

Recommended Video

    CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
    ఆన్ లైన్ విచారణకు నో

    ఆన్ లైన్ విచారణకు నో

    దీనికి న్యాయమూర్తి అంగీకరిస్తూ..సీఐడీ అదనపు డీజీ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసారు. సీఐడీ విచారణకు ఆన్‌లైన్‌ ద్వారా స్పందించేందుకు వెసులుబాటునివ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఇక, రఘురామ రాజు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో..ఈ నెల 11వ తేదీ వరకు వేచి చూసి తన రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

    స్పీకర్ ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన విచారించి నివేదిక ఇవ్వాలంటూ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. దీంతో..ఇప్పుడు రఘురామ వ్యవహారం కోర్టులో మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+