ఇండియా కూటమిలోకి తెలుగుదేశం..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ, జనసేన పొత్తు అధికారికమైంది. చంద్రబాబును కుట్ర పూరితంగా జైలులో పెట్టారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ తాను చంద్రబాబుకు అండగా ఉంటానని ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆకాంక్షించారు. ఇదే సమయంలో టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందని వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

మారుతున్న సమీకరణాలు : చంద్రబాబు అరెస్ట్ అయి నేటితో వారం పూర్తయింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటీషన్లను కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో రాజకీయంగా చంద్రబాబు అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

MP Vijaya Sai Reddy predicts TDP to support INDIA alliance, says Chandra Babu cang fight single in Elections

చంద్రబాబు స్కిల్ స్కాంలో అవినీతి చేసారని ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు..విచారణ అధికారులు వివరిస్తున్నారు. కౌంటర్ గా టీడీపీ సైతం అసలు ఈ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ కేంద్రంగా ఇదే వాదన వినిపిస్తున్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎవరూ స్పందించలేదు.

సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు : ఈ సమయంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాయిరెడ్డి చేసిన ట్వీట్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న నేతలు లోకేశ్ కు ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది ఇండియా కూటమిలోకి టీడీపీ భాగస్వామి అనేది స్పష్టం చేస్తుందన్నారు.

వీరందరి వ్యూహం ఒక్కటేనని దోచుకోవమే లక్ష్యమని సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు టీడీపీకి సత్తా లేదని సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన తరువాత పవన్ పొత్తు ప్రకటన వేళ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు.

బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ : 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి పొత్తు పైన స్పష్టత రాలేదు. ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తనంతట తాను టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

ఈ ససమయంలో చంద్రబాబు కు మద్దతుగా ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి స్పందన లేదు. దీంతో, ఇక ఇండియా కూటమితోనే టీడీపీ కొనసాగుతుందంటూ తాజాగా విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+