హోదా ఇవ్వండి.. క్రెడిట్ అంతా మీకే ఇస్తాం: పురందేశ్వరికి విజయసాయి రెడ్డి కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడంతో ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నిన్న బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
దీంతో తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలకు బిజెపి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. కేంద్ర పథకాల క్రెడిట్ తీసుకోవలసిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వండి.. క్రెడిట్ అంతా మీకే ఇస్తామంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. పోలవరం ప్రాజెక్టు, చెన్నై వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అడిగారు. అంతేకాదు రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి పురందేశ్వరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Recommended Video

కాగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో బిజెపి పై కావాలని దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరిస్తుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీ లలో కేంద్ర నిధులు ఉన్నాయని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
ఇళ్ల నిర్మాణానికి తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం 20 వేల కోట్లు ఇచ్చిందని రాష్ట్రంలో ఇప్పటికే 65% ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలని కానీ 35 శాతం కూడా పూర్తి కాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో తాజాగా సాయిరెడ్డి పురందేశ్వరి వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పారు. బీజేపీ ఏపీకి ఏ విషయాలలో అన్యాయం చేస్తుందో చెప్పారు.












Click it and Unblock the Notifications