‘బావ’సారూప్య పార్టీ అధ్యక్షురాలు బాబుకు ‘క్లీన్’సర్టిఫికెట్ ఇచ్చారు: పురందరేశ్వరిపై సాయిరెడ్డి విసుర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడంపై పెద్ద దుమారం నడుస్తుంది. వైసిపి నేతలు చంద్రబాబు అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంటే, టిడిపి సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ కొనసాగుతుంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు జారీ చేయడంపై తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తన స్పందన తెలియజేయడానికి ఆమె ఆసక్తి చూపలేదు. ఐటీ నోటీసులు జారీ అన్నది ఒక సాధారణ ప్రక్రియ అంటూ పురందరేశ్వరిని తీసి పారేశారు. అటువంటి వాటిపై తాను స్పందించబోనని ఆమె స్పష్టం చేశారు.

ఇక తాజాగా పురందరేశ్వరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చంద్రబాబుకు పురందరేశ్వరి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు గారికి ఐటీ నోటీసులు సాధారణ అంశం అంట.. 'బావ' సారూప్య పార్టీ అధ్యక్షురాలు ఆయనకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటూ పురందరేశ్వరిని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
ఇక ఎల్లో మీడియా కూడా ఇదే భజన చేస్తోందని పేర్కొన్న ఆయన, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి లకు బాబుతో వ్యాపార సంబంధాలు ఉన్నాయా? అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇస్తేనే కదా 118. 9 కోట్ల కమీషన్ స్టీల్ టన్నులు అనే కోడ్ భాష వాడి ముట్టజెప్పారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
అంతకుముందు అమరావతిలో షెడ్ల లాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశారు అంటే చంద్రబాబు, ఇక శాశ్వత సచివాలయ భవనాలు కట్టి ఉంటే లక్షల కోట్ల ముడుపులు తీసుకునేవాడేమో... అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన నాటి నుండి సాయిరెడ్డి నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications