చంద్రబాబు, లోకేష్ పై విజయసాయి రెడ్డి ఆరోపణలు విడ్డూరం: బుద్దా వెంకన్న
భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల పాత్ర ఉందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
విజయవాడ: భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల పాత్ర ఉందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం మండిపడ్డారు.
ఈ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని, 16 నెలలపాటు జైలులో ఉన్న విజయసాయి రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు అంటే వైసీపీ నేతలకు భయమెందుకో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ దర్యాప్తుపై వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి గనుక ఉంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చెప్పింది నిజమేనని ఒప్పుకోవాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications