• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేంటి బోకేష్: సాయిరెడ్డి ట్వీట్; తింగరి సాయిరెడ్డి.. నీ ఏ2 తెలివితేటలు: అయ్యన్న కౌంటర్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న సందర్భం దొరికినా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం, సంచలన వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవాయితీగా మారింది. ఇక నిత్యం ట్విట్టర్ వేదికగా టిడిపిని టార్గెట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా లోకేష్ పై సంచలన పోస్ట్ పెట్టారు. ఇటీవల లోకేష్ బాదుడే బాదుడు కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అక్కడ ఓ పిల్లాడి తో సెల్ఫీ దిగిన ఫోటోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి తనదైన శైలిలో లోకేష్ ను టార్గెట్ చేశారు. బోకేష్.. పప్పు.. అరేయ్ ఒరేయ్ అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోశారు.

అందుకే కదా నిన్ను పప్పు అంది: లోకేష్ ను టార్గెట్ చేసిన సాయిరెడ్డి


ఒక చిన్న పిల్లాడితో ఫోటో దిగుతున్న లోకేష్ సెల్ ఫోన్ తిరగేసి పట్టుకోవడాన్ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఆ ఫోటో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ఎద్దేవా చేశారు. ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే ఆ బుడ్డోడు ఫ్రేమ్ లోకి ఎలా వస్తాడు? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఫోన్ ను తలకిందులు చేసే బదులు నువ్వే తలకిందులుగా...తల కిందకు పెట్టి, కాళ్ళు పైకెత్తి సెల్ఫీ తీసుకుంటే అందరూ పడతారు కదా! అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. అందుకే కదా నిన్ను పప్పు అంది అని విజయసాయిరెడ్డి పోస్ట్ పెట్టారు.

విజయసాయిరెడ్డి లోకేష్ మీద పెట్టిన పోస్ట్


ఇక విజయసాయిరెడ్డి లోకేష్ మీద పెట్టిన పోస్ట్ కి టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అయ్యన్నపాత్రుడు ఏ మాత్రం తగ్గకుండా అరేయ్ ఒరేయ్ అంటూ సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఒరేయ్ తింగరి సాయి రెడ్డి అంటూ విరుచుకు పడిన అయ్యన్నపాత్రుడు ఫోన్ ఎటు తిప్పి పట్టుకున్నా ఒకటే బొమ్మ వస్తుంది రా అంటూ పేర్కొన్నారు. ఫోన్ తిప్పి పట్టుకుంటే బొమ్మ తిరగేసి రాదు అంటూ విజయసాయిరెడ్డికి సెటైర్లు వేశారు. నువ్వు నీ ఏ2 తెలివితేటలు అంటూ సాయి రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరూ లండన్ మందులు వాడే మీ పెద్ద తింగరోడు జఫ్ఫా గాడిలా ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి కి మాటకు మాట అప్పగించేశారు.

వియసాయిరెడ్డి ఫోన్ దొరకాలని తిరుపతి వెంకన్నను వేడుకున్నా: అయ్యన్న

వియసాయిరెడ్డి ఫోన్ దొరకాలని తిరుపతి వెంకన్నను వేడుకున్నా: అయ్యన్న


అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, జగన్ దుర్మార్గపు పాలన నుంచి కాపాడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొన్న విజయసాయి రెడ్డి పోలీసులకు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారని, విజయసాయిరెడ్డి ఫోను త్వరగా దొరకాలని తాను దేవుడిని వేడుకున్నానని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, విశాఖ భూ స్కామ్ ఆధారాలు ఆ ఫోన్ లో ఉన్నాయని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు, ఆ ఫోన్ దొరికితే సాయి రెడ్డి ఆస్తులు జప్తు అవుతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రచ్చకు ఫోన్ వేదికగా మారింది.

తాడిపత్రిలో మీరు విసిరిన రాళ్లు.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ని తాకుతాయి: నారా లోకేష్తాడిపత్రిలో మీరు విసిరిన రాళ్లు.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ని తాకుతాయి: నారా లోకేష్

English summary
Sai Reddy targeted Lokesh by sharing a photo of Lokesh holding the phone upside down asking what is this Bokesh. Ayyannapatrudu countered Sai Reddy by saying, Thingari Sai Reddy, keep your A2 intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X