"23" నెంబర్ పై విజయసాయి రెడ్డి సంచలనం!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చెయ్యటం, ఏసీబీ కోర్టు చంద్రబాబునాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించడం , చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం వెరసి ఏపీలో ఉత్కంఠభరిత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37 వ నిందితుడిగా ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో ఏపీలోని వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత కాలానికి చంద్రబాబు పాపం పండిందని, ఎంతోమందిని ఏడిపించిన చంద్రబాబు ఇప్పుడు ఏడ్చే పరిస్థితి వచ్చిందని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబును విమర్శించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే విజయసాయిరెడ్డి చంద్రబాబు ఇంకా రాజకీయ యవనికపై కనిపించరు అంటూ పోస్ట్ పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించడంతో ఈ నెంబర్ పైన విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
7+6+9+1 = 23. చంద్రబాబు గారూ... అంటూ చంద్రబాబుకు 23 నెంబర్ ను గుర్తు చేశారు. మీకు 2023 చివరి సంవత్సరం అంటూ చంద్రబాబుకు 23 కలిసిరాదని తేల్చేశారు. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు అంటూ సాయిరెడ్డి జోస్యం చెప్పారు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు అంటూ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు చేశారు.
మొత్తంగా 23 నెంబర్ చంద్రబాబుకు బాగా కలిసి వచ్చిందని , అది చంద్రబాబు లక్కీ నెంబర్ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. చంద్రబాబు రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పవలసిందేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications