అదే జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా చంద్రబాబును టార్గెట్ చేశారు. బాబు స్కిల్డ్ నేరస్తుడు అని, ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని విమర్శించారు. చంద్రబాబు ఈరోజు జైల్లో ఉండడానికి పరోక్షంగా రామోజీరావు కారణమని రామోజీరావుని సైతం టార్గెట్ చేశారు.
చంద్రబాబు లాంటి నేర స్వభావం ఉన్న వ్యక్తి ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా మారడానికి, రాష్ట్రాన్ని స్థాయికి దిగజార్చటానికి రామోజీరావు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేసే ప్రతి తప్పును గొప్ప విజనరీగా చిత్రీకరించిన రామోజీరావు తప్పులను ఎంకరేజ్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చిన రామోజీరావు తీరే ఈరోజు చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణంగా మారిందని సాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు చేసిన అనేక నేరాలలో రామోజీరావు పాత్ర పైన కూడా విచారణ జరగాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు బ్రష్టు పట్టడానికి చంద్రబాబు కారణమని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ విషయంపై తాను ఎక్కడైనా, ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో చంద్రబాబు చెయ్యని అవినీతి లేదని, ఓటుకు నోటు కేసు నుండి రాజధాని అమరావతి, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల వరకు ప్రతిదానిలోనూ చంద్రబాబు స్కాములు చేశారని మండిపడ్డారు.
రాజకీయాలను సామాన్యులకు దూరం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, మొదటి నుంచి చంద్రబాబు నీచ రాజకీయాలు చేశాడని తిట్టి పోశారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, డబ్బులతో ముడిపెట్టి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ షెల్ కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లోకి నిధులు మళ్లించారని పేర్కొన్నారు.

చంద్రబాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ప్రతీ కేసులోనూ స్టే తెచ్చుకున్నారని వ్యవస్థలను మేనేజ్ చేశారని, కానీ ఇప్పుడు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు అని వ్యాఖ్యానించారు. స్కిల్ నేరస్తుడిని పట్టుకోవడం శిక్షించడం కష్టమని పేర్కొన్న ఆయన చంద్రబాబు నీతిపరుడు అని ఎవరు చెప్పలేకపోతున్నారని, కనీసం టిడిపి నాయకులు కూడా చెప్పడం లేదని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును విచారించవలసిన ఆరేడు కేసులు ఉన్నాయని, ఈ కేసులలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదని, ఈ కేసుల్లో నేరం రుజువైతే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications