బాలినేని తో గ్యాప్ పై సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
మాజీ మంత్రి బాలినేని పై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత కాలంగా బాలినేని పార్టీలో పరిస్థితుల పైన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సొంత పార్టీ నేతల పైనే బాలినేని పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష నియామకం పైన బాలినేని స్పందించారు. ప్రస్తుతం వైసీపీ లో పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు జరుగుతోంది. ఈ సమయంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. పార్టీ నేతల అరెస్ట్ ను ఖండించారు.
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు. తమ పార్టీ నేతలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎంపీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. ఈ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైకి వరదనీరు రాకుండా బుడమేరు మళ్లించారని ఆరోపించారు. అందువల్లే విజయవాడ ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారున్నారు.

ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతున్నారనేది అవాస్తవమని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. బాలినేనికి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలు చెప్పేందుకే ఆయన సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారేమోనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుణ్ని నియమిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications