టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' వికటిస్తోందా?: సొంత గూటికి చేరుకున్న ఎంపీపీ
అమరావతి: ఏపీలో అధికార పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' వికటిస్తోందా? అంటే అవుననే అంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి 20 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపుల్లో భాగంగా ఎమ్మెల్యేలతో పాటు వారి మద్దతుదారులు కూడా టీడీపీలో భారీ ఎత్తున చేరారు.
అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కిందిస్థాయి నేతల మధ్య సఖ్యత కుదరడం లేదనేది వాస్తవం. ముఖ్యంగా పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు కింది స్థాయి నేతలు సైతం ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం నచ్చని నేతలు బాహాటంగానే తమ నిరసనను ఎమ్మెల్యేలపై వ్యక్తం చేయడం మనం చూశాం. అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు కింది స్థాయి కార్యకర్తలను కూడా టీడీపీకి చెందిన నియోజక వర్గ ఇంచార్జిలు, నేతలు చిన్న చూపు చూస్తున్నారు.

ఏవో తమ పనులను చక్కబెట్టుకుందామని వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తే సత్కారాలకు బదులు ఛీత్కారాలు ఎదువరవుతున్నాయని అనుకుంటున్న నేతలు తిరిగి తమ సొంత గూటికే చేరుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ విమల వైసీపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీపీ విమల విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తన కుమారుడి ఫంక్షన్ కోసమని తీసుకెళ్లి తమ చేత బలవంతంగా పచ్చ కండువాలు కప్పించారని ఆమె అన్నారు. తన ప్రమేయం లేకుండా జరిగిందని, తనను క్షమించాలని కోరారు.
అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే అమర్నాథరెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లానన్నారు. తిరిగి సొంత పార్టీ వైసీపీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు వైసీపీయే కారణమన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
సీనియర్ నాయకులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేస్తామన్నారు. జగన్ అన్న ఆశయాల మేరకు పార్టీ పరంగా ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైయస్ జగన్‌ను సీఎం చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతోందని ఆమె తెలిపారు.
టీడీపీ డబ్బులకు లొంగేది లేదని, అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురొడ్డి పోరాడుతామని తేల్చి చెప్పారు. పలమనేరులో వైసీపీ బలంగా ఉందని చెప్పిన ఆమె, ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, టీడీపీలో చేరిన ఎంపీపీ తిరిగి ఇలా వైసీపీలో చేరడంతో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి పెద్ద షాక్ తగిలింది. పలమనేరు నియోజకవర్గంలో మరికొందరు నేతలు ఇదే బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications