వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయం.!హైకోర్ట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న జనసేన.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో ఎన్నికలు, రాజకీయాలు, వ్యక్తిగత ఆరోపణలు కాకుండా కరోనా కట్టడికి రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ మొదటినుండీ చెప్పుకొస్తున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికలను కూడా రద్దు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కి జనసేన లేఖ కూడా రాసింది. అమరావతిలోని అధికార వైసీపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి గతంలో ఇదే ఎన్నికల అంశంలో లేఖలు కూడా రాసింది జనసేన. రాజకీయాలు, ఎన్నికలే పరమావది కాకుండా ప్రజాసంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని పలుసందర్బాల్లో జనసేన రాజకీయ పార్టీలకు సూచనకూడా చేసింది.

ఇలాంటి తరుణంలో గత ఏప్రిల్ నెలలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపి హైకోర్ట్ తీర్పు ఇవ్వడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే తీర్పుగా జనసేన అభివర్ణించింది. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితులు కారణంగా ఎన్నికలు రద్దు చేశారని, తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని జనసేన స్పష్టం చేసింది. ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినప్పుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేసారు ఆ పార్టీ నేతలు.

 MPTC, ZPTC Election cancellation is gratifying!Janasena welcomes High Court decision

తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు తగిన సమయం ఇవ్వాలని జనసేన విస్పష్టంగా డిమాండ్ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తుదకు హైకోర్టు ఈ ఎన్నికలను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నట్టు జనసేన తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన విజ్ఞప్తి చేసింది.

English summary
Janasena welcomed the Andhra Pradesh High Court's decision to cancel the April MPTC and ZPTC elections. Janasena described it as a suffocating verdict for democracy and local self-government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X