కాపులు: చెప్పారుగా.. బాబుకు పవన్ కళ్యాణ్ సూచన, ముద్రగడ దీక్షను భగ్నం చేస్తారా?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల పైన మరోసారి స్పందించారు. ఆదివారం నాడు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. తుని ఘటన నేపథ్యంలో వారం రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన పవన్ కాపు రిజర్వేషన్ల పైన స్పందించారు.

తాజాగా, ఈ రోజు మళ్లీ స్పందించారు. కాపు నేతలతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలని టిడిపి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు.

అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి మేధావుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ముద్రగడ దీక్ష భగ్నం చేస్తారా?

కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ దీక్షను పోలీసులు ఎప్పుడైనా భగ్నం చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముద్రగడతో చర్చలకు ఎవరినీ పంపించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం విశాఖలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+