'నేనో అల్పుడిని, పవన్ గురించి మాట్లాడేంత రేంజ్ లేదు' : ముద్రగడ

విశాఖపట్నం : తిరుపతిలో నేటి సాయంత్రం జరగబోయే పవన్ కళ్యాణ్ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అబిమానులతో పాటు అటు రాజకీయ నేతలు కూడా పవన్ ఏ అంశాలను ప్రస్తావిస్తాడా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. పవన్ ప్రసంగంపై ఊహాగానాల లెక్కలు కూడా మొదలైపోయాయి. పవన్ అభిమాని వినోద్ హత్యలో కుల కోణం తెరపైకి రావడం.. ఏపీలో కాపు కుల రిజర్వేషన్ల వ్యవహారం ఇంకా నాన్చుడు ధోరణిలోనే సాగుతుండడంతో.. సామాజిక సమీకరణాలపై పవన్ ఎలా స్పందిస్తడాన్నది అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోన్న అంశం.

Mudragada Interesting comments over Pawan public meet

ఇదే క్రమంలో.. విశాఖ పర్యటనలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను దీనిపై స్పందించాల్సిందిగా కోరింది మీడియా. అయితే పవన్ సభపై స్పందించడానికి తిరస్కరించిన ముద్రగడ.. 'పవన్ కల్యాణ్ తో పోలిస్తే తాను అల్పుడినని, అతని స్థాయికి తగనని, నేటి తిరుపతి సభ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని' ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇక కాపు రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ.. కాపులను బీసీల్లో చేర్చే సమయం ఆసన్నమైందన్నారు ముద్రగడ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్న ఆయన.. వెంటనే తమ డిమాండ్ ను నెరవేర్చాలన్నారు. ఈ విషయంలో బాబు ఇకనైనా ముందడుగు వేయకుంటే కాపు ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని హెచ్చరించారు ముద్రగడ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+