కాపు ఉద్యమ కారకుడు చంద్రబాబు-నోరెత్తని పవన్-ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తన పని మొదలుపెట్టేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇవాళ మాటల దాడి ప్రారంభించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలతో ఇవాళ భేటీ అయిన ముద్రగడ.. కాపు ఉద్యమం సమయంలో చంద్రబాబు, పవన్ వ్యవహరించిన తీరును వారితో పంచుకున్నారు.
ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడను పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలు కలిశారు. వారితో మాట్లాడుతూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడని ఆయన ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసం చేయడం వల్లే ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు. ఇచ్చిన హమీని అమలు చేయకుండా రోడ్డేక్కే పరిస్ధితిని చంద్రబాబు కల్పించారని ఆరోపించారు.

గతంలో చంద్రబాబు పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్యమకారులను కొట్టినా..కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదంటూ ముద్రగడ మరో సంచలన ఆరోపణ చేశారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ కళ్యాణ్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తానని చెబుతున్న పవన్....ఓటర్లు అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేయడం సరికాదన్నారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications