ఇదే నా ఆఖరి పోరాటం, చావుకు కారణమైన నేరస్థుడు: ముద్రగడ

తుని విధ్వంసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజమహేంద్రవరం: తుని విధ్వంసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తుని రైల్వే స్టేషన్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తే విధ్వంసం జరిగి ఉండేది కాదని చెప్పారు. దమ్ముంటే వాయిదాలు లేకుండా తుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు పెడతారా అని నిలదీశారు.

కాపులను చీట్ చేసిన చంద్రబాబుపై కేసులు పెట్టాలన్నారు. పుష్కరాల్లో దాదాపు 30 మంది చావుకు కారణమైన నేరస్థుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తన యాత్రను అడ్డుకుంటే ఊరుకునేది లేదని చెప్పారు.

Mudragada Padmanabham fires at Chandrababu Naidu

అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ నెల 26వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఆ లోగా కాపులను బీసీల్లో చేర్చుతామని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు.

ఇదే తన ఆఖరి పోరాటం అని చెప్పారు. నా జాతి కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల్లో చేర్చాలని కోరుతున్న తనపై కుట్ర చేయడం బాధేస్తోందని ముద్రగడ అన్నారు. దమ్ముంటే చంద్రబాబు తన నేర చరిత్ర నిరూపించాలన్నారు.

1996 చరిత్ర చూస్తే చంద్రబాబుది నేర చరిత్రానా, తనది నేర చరిత్రనా తేలుతుందన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన కాపీ ఇస్తే, తాను కూడా అలాగే అనుమతి తీసుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+