వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ; సంక్రాంతి పందాల కోసం రిక్వెస్ట్!!

|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో తన లేఖలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను అంటూ సంక్రాంతికి కోడిపందాలు, ఎడ్ల పందాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని, ఇది ఆనవాయితీగా తమ ప్రాంతంలో కొనసాగుతున్న పండుగ సంబరం అని లేఖలో పేర్కొన్నారు..

సీఎం జగన్ కు పండుగలపై ముద్రగడ లేఖ

సీఎం జగన్ కు పండుగలపై ముద్రగడ లేఖ


వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో ఆయన గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా చాలా ఘనంగా చేయడం ఈ ప్రాంత వాసులకు అలవాటుగా వస్తున్న ఆచారం అంటూ పేర్కొన్నారు. ఎడ్లు,గుర్రం, కోడిపందాలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పోటీలు, జాతరలు వగైరాలతో సుమారు ఐదు రోజుల పాటు పండుగను విశేషంగా జరుపుకుంటారు అంటూ పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జరిగే వివిధ పందాలు, పోటీల గురించి పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ కోడి పందాలకు, ఎడ్ల పందాలకు పోలీసుల ఇబ్బంది

సంక్రాంతి పండుగ కోడి పందాలకు, ఎడ్ల పందాలకు పోలీసుల ఇబ్బంది

నాకు తెలిసి 1978 నుండి ఇంచుమించుగా 2004 వరకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులను, అప్పటి ముఖ్యమంత్రులను పోటీలు నిర్వహించుకోవడానికి అనుమతులు అడిగే వారిమని, వారు కూడా అనుమతించేవారు అని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పండుగ ఉత్సవాలలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు వారు చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఆఖరున పర్మిషన్ ఇచ్చామని తూతూమంత్రంగా చేస్తున్నారంటూ పేర్కొని ఆ సమయంలో పోలీస్ శాఖ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ లేఖ ద్వారా వెల్లడించారు.

సంక్రాంతికి, ఉగాదికి ఐదు రోజుల చొప్పున పర్మిషన్ కి పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి

సంక్రాంతికి, ఉగాదికి ఐదు రోజుల చొప్పున పర్మిషన్ కి పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి


ఈ రెండు పండుగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంక్రాంతికి, ఉగాదికి ఐదు రోజుల చొప్పున పర్మిషన్ కి పర్మినెంట్ ఆర్డర్స్ ఇప్పించ వలసిందిగా కోరుతున్నాం అంటూ సంక్రాంతి పండుగకు ఐదు రోజులు కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. పండుగల సమయంలో చాలా వరకు ప్రజలకు పని ఉండదని ఆ కారణంగా ఉత్సవాలలో వారు పాలు పంచుకుంటారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించుకునే ఆటలు, సంబరాలు జల్లికట్టు కన్నా ప్రమాదకరమైన ఆటలు, సంబరాలు కాదని, దయచేసి పండుగలకు ప్రజలను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయమని కోరుతున్నాము అంటూ ముద్రగడ పద్మనాభం తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Recommended Video

త్వరలోనే ఓ పార్టీకి మద్దతు: కాపు నేత ముద్రగడ ప్రకటన | జనసేనకే అంటున్న రాజకీయ పరిశీలకులు..!!
ఏపీలో పండుగ సంబరాల కోసం ముద్రగడ విజ్ఞప్తి

ఏపీలో పండుగ సంబరాల కోసం ముద్రగడ విజ్ఞప్తి

ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున కోడి పందేలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఆసక్తి చూపిస్తారు. పండుగకు నెలరోజులు ముందుగా ఉండే కోడి పందేలతో రాష్ట్రంలో కోలాహలం నెలకొంటుంది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా కోడిపందాలను పలువురు నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల కోడి పందాలు నిర్వహించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కోడిపందాలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మరి ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

English summary
Mudragada Padmanabhan wrote a letter to AP CM Jagan. cock fight bettings and bull fight bettings are becoming a tradition and requested the CM Jagan to give permanent orders giving five days permission without any restrictions of police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X