హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ..!!

ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగవ్వలేదు. ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరం కావటంతో హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పైన మాజీ సీఎం జగన్ ఆరా తీసారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకెళ్లటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరి కాదని వైద్యులు సూచించారు. దీంతో.. జగన్ పార్టీ నేతలకు ఏయిర్ అంబులెన్స్ లో తరలించాలని ఆదే శించారు. ఇక, ప్రస్తుతం ముద్రగడకు డయాలసిస్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పరీక్షల తరువాత హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. ముద్రగడ ఆరోగ్యం పైన ఆరా తీసిన జగన్ హైదరాబాద్ తలించేందుకు ఏయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. దీంతో, ఎయిర్‌ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌ తీసుకువెళ్తారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మ­నాభంకు రెండు రోజులుగా కాకినాడ మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

mudragada-padmanabham-to-shift-hyderabad-by-air-ambulance-as-jagan-advice

పద్మనాభం ఆరోగ్య పరి­స్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు జగన్ ఆయన కుమారుడు గిరిని అడిగి తెలుకున్నారు. కాకినాడ వైద్యు­లూ హైద­రాబాద్‌ తీసుకువెళ్లడం మంచిదని, అయితే రోడ్డుమార్గం అంత శ్రేయ­స్కరం కాదని చెప్పారు. అదివారం రాత్రి తరలిం చేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో సోమవారం ఉదయం హైదరాబాద్‌ యశోద హాస్పిట ల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే, కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడు తున్న ముద్రగడకు షుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆయన కు డయాలసిస్ కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్ లో మెరుగైన వైద్యం అందించటం ద్వారా కోలుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+