అప్పుడు రెడ్లకిచ్చి-ఇప్పుడు కాపుల్ని ? జగన్ పై ముద్రగడ కుమార్తె ఫైర్..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ రిపోర్ట్ తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిట్ రిపోర్ట్ తర్వాత జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ గత వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుబడుతుంటే.. కల్తీ జరిగిందని తేలాక కూడా ఈ దబాయింపులేంటని కూటమి ప్రశ్నిస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి చంద్రబాబును తిట్టడం, దీనిపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి. ఇది కాస్తా కాపు రాజకీయం రంగు పులుముకుంది.
లడ్డూ క్లీన్ చిట్ ఎవరిచ్చారు ? క్రాంతి (mudragada)
ఈ నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (mudragada padmanabham) కుమార్తె, జనసేన నేత క్రాంతి బార్లపూడి జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో లడ్డూ కల్తీ అయిందని సీబీఐ చెప్పినా క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు వైసీపీ హడావిడి చేస్తోందన్నారు. 60 లక్షల కిలోల నెయ్యి భయంకరమైన రసాయనాలతో తయారయ్యిందని తేల్చారని, ఈ రసాయనాల్లో చౌకగా దొరికే జంతువుల కొవ్వు కాకుండా ఇంకేముంటుందని ప్రశ్నించారు. దీన్ని దారి మళ్లించడం కోసమే అంబటి, జోగి రమేశ్ తో చంద్రబాబును తిట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూసిందన్నారు.

ఇవన్నీ చూడలేకే జగన్
జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తే చంద్రబాబు వచ్చాక పోలవరం, అమరావతి పనులు ముందుకెళ్తున్నాయని క్రాంతి తెలిపారు. దీనికి తోడు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు. పవన్ కూడా పంచాయతీరాజ్ శాఖను పరుగులు తీయిస్తున్నారని, కుంకీ ఏనుగులు తెప్పించి,మన్యంలో రోడ్లు వేయించి, 13 వేల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారన్నారు. ఇవన్నీ చూడలేక జగన్ అభద్రతాభావంతో కులాల గొడవలు రేపుతున్నారన్నారు.

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే, చాలా దారుణంగా ఉన్నాయి. జగన్ గారు ప్రవర్తన భయంకరంగానే ఉంది.
— Kranthi Barlapudi (@kr_barlapudi) February 3, 2026
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ చేసిందని క్లియర్ గా సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నా సరే వీళ్ళకి ఏమీ జరగనట్టు క్లీన్ చిట్ ఇచ్చేసిందన్న రీతిలో @YSRCParty…
అప్పుడు రెడ్లు, ఇప్పుడు కాపులు
లడ్డూ కల్తీ జరగలేదని తన తండ్రి ముద్రగడ ఎలా అనగలుగుతున్నారో అర్ధం కావట్లేదన్నారు. గతంలో ఆయన ఉద్యమాన్ని వాడుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ హామీలు నిలబెట్టుకోకపోయినా తన తండ్రి మద్దతునివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయినా జగన్ ఆయన్ను గుర్తించలేదన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా అని జగన్ ను ఆమె ప్రశ్నించారు. జగన్ కు అధికారంలో ఉంటే రెడ్లు కావాలి అధికారం పోతే కాపులు కావాలన్నారు. అంబటి రాంబాబను వాడుకుని ఏ విధంగా అల్లర్లు చేయాలని చూస్తున్నారో, అలాగే రేపు మా నాన్నగారిని కూడా వాడుకుని బలిపశువుని చెయ్యరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ ఉచ్చులో పడి కాపులు మరోసారి మోసపోవద్దని కోరారు.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications